Tirumala: వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తుల రద్దీ నెలకొంటుంది.. ఒక రోజు నుంచి పది రోజులకు ఎప్పుడు పొడిగించారో తెలుసా..

హిందూ మతంలో ఏకాదశి తిధికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఒకొక్క ఏకాదశికి ఒకొక్క పేరు. అయితే సూర్యుడు ధనుర్మాసంలో ఉత్తరాయణంలోకి అడుగు పెట్టడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి విష్ణు పురాణంలో ఉంది. ఈ రోజున ఏదైనా వైష్ణవ దేవాలయంలో స్వామివారి దర్శించుకోవడం అది కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అందుకనే కలియుగ దైవం కొలువైన తిరుమలకు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు.

Surya Kala

|

Updated on: Jan 09, 2025 | 2:53 PM

హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఏదైనా వైష్ణవ క్షేత్రంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో కలియుగ వైకుంటంగా బాసిల్లుతోన్న తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని భావిస్తారు. వెంకన్న వైకుంఠ ఏకాదశి నుంచి స్వామివారు 10 రోజుల పాటు ఉత్తర ద్వారం దర్శనం ఇవ్వనున్నారని టీటీడీ ప్రకటించింది. అయితే టోకెన్లు, లేదా టికెట్లు ఉన్నవారికి మాత్రమె ఈ పది రోజులు స్వామివారిని దర్శించుకునే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఇచ్చే టోకెన్ల కోసం పోటెత్తారు.

1 / 8
తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కోసం బుధవారం టోకెన్ల పంపిణీ టీటీడీ చేపట్టింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇంత రద్దీ ఎందుకు ఉంటుంది? ఎందుకు టోకెన్ల కోసం భక్తులు పోటీపడ్డారు? ఈ రోజు తెలుసుకుందాం..

2 / 8
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడుకొండల వాడు కొలువైన తిరుమలపై ఇసుక వేస్తె నేల రాలదు అన్న చందంగా భక్తుల రద్దీ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు స్వామివారు ఇచ్చే ఉత్తర ద్వార దర్శనం కొడం దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు.

3 / 8
తిరుమలలో జరిగే ఉత్సవాలను చారిత్రాత్మకంగా చూస్తే రెండు ప్రధాన ఘట్టాలున్నాయి. ఒకటి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలను చూసేందుకు తిరుమలకు చేరుకుంటారు. మరొకటి వైకుంఠ ఏకాదశి. అయితే ఈ వైకుంఠ ఏకాదశిని కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఒకే రోజు నిర్వహించేవారు. అయితే క్రమంగా వేంకటేశ్వరుడిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడం మొదలు పెట్టారు. 1980, 1990లలో లయ అధికారులు వైకుంఠ ద్వాదశిని అదనపు పవిత్రమైన రోజుగా గుర్తించడం ద్వారా ఉత్సవాలను పొడిగించారు.

4 / 8
మకర సంక్రాంతి పండుగకు ముందు రెండు రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. తిరుమలలో వేంకటేశ్వరునిగా పూజలందుకుంటున్న శ్రీ మహా విష్ణువు ఈ సమయంలో తనను దర్శించుకున్న వారికి స్వర్గలోకం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.

5 / 8
వైకుంఠ ఏకాదశికి 41 రోజుల ముందుగానే భక్తులు గోవింద మాల ధరించి, పసుపు వస్త్రాలు ధరించి, భక్తికి గుర్తుగా చెప్పులు లేకుండా నడుస్తూ తిరుమలకు చేరుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి సిద్ధమయ్యారు. చాలా మంది యాత్రికులు సుదూర ప్రాంతాల.. కొన్నిసార్లు వందల కిలోమీటర్ల నడిచి తిరుమలకు చేరుకుంటారు. ఈ ఏకాదశి ఉత్సవాల కోసం తిరుమల చేరుకోవడానికి ఒక వారం లేదా పది రోజుల ముందు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

6 / 8
భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకున్న పరిపాలన, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మత పెద్దలను సంప్రదించిన తర్వాత, 2021-2022లో వైకుంఠ ఏకాదశి , ద్వాదశి లో మాత్రమే కాదు ఏకంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం పది రోజుల పాటు ఇవ్వాలని నిర్ణయించారు. అలా ఇప్పుడు పది రోజుల పాటు స్వామివారిని ఈ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే వీలు కలిగింది. ఈ నిర్ణయం తర్వాత శ్రీ వేంకటేశ్వరుని గర్భగుడి దగ్గర ఉన్న ఉత్తర ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచబడుతుంది. భక్తులు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించడానికి.. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. భారీ రద్దీని నియంత్రించడం, భక్తులందరికీ దర్శనానికి అవకాశం కల్పించడం దీని లక్ష్యం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలను పది రోజులకు విస్తరించింది.

7 / 8
పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు తన శిష్యులతో వైకుంఠంలో ఒక సమావేశాన్ని నిర్వహిస్తాడు. భక్తులను కూడా ఈ సభలోకి అనుమతిస్తాడు. భూమిపై ప్రతీకాత్మకంగా ప్రతిబింబించే ఈ ఖగోళ సమావేశం పది రోజులు ఉంటుంది. అందువల్ల పది రోజుల పాటు ఉత్తర ద్వారం తెరిచి ఉంచాలని, భక్తులను ఈ పది రోజులు స్వామివారిని ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి అనుమతించాలని పోంటీఫ్‌లు, టిటిడి పరిపాలన అధికారులు నిర్ణయించారు. దీంతో ఒక రోజు వైకుంఠ ఏకాదశి నుంచి తరవాత రెండు రోజులకు (ఏకాదశి, ద్వాదశి) ..ఇప్పుడు పది రోజులకు పొడిగించారు. ఈ రోజులలో స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు మోక్షాన్ని పొందుతారని బలమైన నమ్మకం ఉంది.

8 / 8
Follow us