AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం టోకెన్లు జారీ.. ఆధార్ గుర్తింపు కార్డు తప్పనిసరి

తిరుపతి లోని 9 ప్రాంతాల్లో సుమారుగా 100 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.  10 రోజుల టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్లను జారీ చేయనుంది. ఈ టోకెన్లను తీసుకునే భక్తులకు ఆధార్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Tirumala: రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం టోకెన్లు జారీ.. ఆధార్ గుర్తింపు కార్డు తప్పనిసరి
Tirumala Tirupati
Surya Kala
|

Updated on: Dec 31, 2022 | 3:09 PM

Share

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ కల్పించనుంది. రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. 10 రోజులకు గాను 4.58 లక్షల టికెట్లు జారీ చేయనుంది. తిరుపతి లోని 9 ప్రాంతాల్లో సుమారుగా 100 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.  10 రోజుల టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్లను జారీ చేయనుంది. ఈ టోకెన్లను తీసుకునే భక్తులకు ఆధార్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లలో విధులకు నియమించిన సిబ్బందికి  శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కౌంటర్లల్లో విధుల్లో ఉన్న సిబ్బంది యాత్రీకులతో మాట్లాడకుండా వేగంగా టోకెన్లు జారీ చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకున్నారు. ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆయా కేంద్రాల ఇంచార్జ్ గా ఉన్న సీనియర్ అధికారి దృష్టికి తేవాలన్నారు.

రిలీవర్ వచ్చే వరకు కౌంటర్ నుంచి వెళ్లరాదని జేఈవో సూచించారు. ఉద్యోగులకు కౌంటర్ల వద్దకే టిఫిన్, తాగునీరు, కాఫీ,టీ, స్నాక్స్ వచ్చే ఏర్పాటు చేశామన్నారు. శనివారం ఉద్యోగులకు సూచించిన సమయానికి 15 నిముషాల ముందే తమకేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని జేఈవో వివరించారు.  క్యూలైన్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, వారికి అన్న ప్రసాదాలు, టిఫిన్, కాఫీ,పాలు, తాగునీరు అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల నాదనీరాజన వేదికపై ఉదయం 3 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం నిర్వహిస్తారు.  

ఇవి కూడా చదవండి

ఈరోజు, రేపు ఎస్‌ఎస్‌డి టోకెన్ల రద్దు: 

డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో ఎస్‌ఎస్‌డి టోకెన్లను రద్దు చేశారు. అంతేకాదు ఈ రెండు తేదీల్లో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లను రద్దు చేశారు. గోవింద మాల భక్తులు టోకెన్ తీసుకునే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలని, టోకెన్ లేకుండా తిరుమలకు వచ్చి ఇబ్బంది పడవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గ దర్శకాలు జారీ చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!