Nag Temple: గజనీ దండయాత్రకు సజీవ సాక్ష్యం ఈ నాగ మందిరం.. పై కప్పు ఎవరైనా నిర్మించాలని చూస్తే వారికి మరణదండనే..
ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయ జిల్లాలోని సెహుద్ గ్రామంలో ఉన్న ధోరా నాగ ఆలయం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ విరిగిన పైకప్పు కింద విరిగిన విగ్రహాలు భక్తులతో పూజలను అందుకుంటున్నాయి. కింద ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు నాగ పంచమి రోజున భక్తులు పూజలు చేస్తారు. ఎవరైనా ఈ ఆలయాన్ని మరమ్మతు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో ఉన్న నాగ మందిరంలో విరిగిన పైకప్పు కింద ఉన్న విరిగిన విగ్రహాలకు భక్తులు పూజిస్తారు. ముఖ్యంగా నాగ పంచమి రోజున విరిగిన విగ్రహాలను వైభవంగా పూజిస్తారు. అయితే ఆలయం విరిగిన పై కప్పుని ఎవరూ ఇప్పటి వరకూ ఎందుకు మరమత్తులు చేయలేదని అనుకుంటున్నారా.. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఈ ఆలయం విరిగిన పైకప్పును మరమ్మతు చేయించడానికి, లేదా ఆలయంలో ఉన్న విరిగిన విగ్రహాలకు మరమ్మతు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. వారి ఇంట్లోని సభ్యులు ఎవరో ఒకరు అకస్మాత్తుగా మరణించే వారని స్థానికులు చెబుతారు.
ఔరైయాలోని దిబియాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సెహుద్ గ్రామంలో ఉన్న పురాతన ధోరా నాగ మందిరం దీని ప్రత్యేకతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే విరిగిన విగ్రహాలు ఘజనీ దండకు సజీవ సాక్షాలు. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ దండయాత్ర సమయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన సత్యాన్ని ఇప్పటికీ తెలియజేస్తున్నాయి. ఆలయంలోని విరిగిన ఈ విగ్రహాలే ఈ ఆలయాన్ని ఇతర దేవాలయాల నుంచి భిన్నంగా చేస్తుంది. నాగ పంచమి రోజున భక్తులు దూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. విరిగిన ఆలయ పైకప్పును నేటికీ మరమ్మతులు చేయలేదు.
విరిగిన ఆలయ పైకప్పును ఇప్పటివరకు మరమ్మతులు చేయలేకపోయారు. ఆలయ పైకప్పు మరమ్మతు చేయడానికి కొంతమంది ప్రయత్నించారని..అయితే పని పూర్తి కాకముందే.. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరోకరు మరణించే వారని లేదా పెద్ద నష్టాన్ని చవిచూశారని స్థానికులు చెబుతున్నారు. లక్నోలో పనిచేసే గ్రామానికి చెందిన ఒక ఇంజనీర్ కూడా ఆలయ పైకప్పు మరమ్మతు చేయడానికి ప్రయత్నించాడు. అయితే పని పూర్తి కాకముందే అతని కుటుంబంలోని ఇద్దరు సభ్యులు మరణించారు.
నాగ పంచమి నాడు జాతర ఈ భయం కారణంగా నేటి వరకూ ఎవరూ ఆలయ పైకప్పు మరమ్మతు చేయాలనే ఆలోచన కూడా చేయరు. హిందూ ఆచారాల ప్రకారం ఏ ఆలయంలోనూ విరిగిన విగ్రహాలను ఉంచరు లేదా పూజించరు. ఇక్కడ విరిగిన విగ్రహాలను మాత్రమే పూజిస్తారు. నాగ పంచమి సందర్భంగా ఇక్కడ ఒక ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ జాతర లో పాల్గొనేందుకు జిల్లా నుంచి మాత్రమే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పాల్గొంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








