Horoscope Today: వీరికి పట్టిందల్లా డబ్బే డబ్బు.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని ఒత్తిడి పెరుగుతుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. కుటుంబంతో కలిసి శుభ కార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొం టారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఒకరి ద్దరు మిత్రులకు ఆర్థికం సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గు తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు మీ సమర్థతను గుర్తిస్తారు. నిరుద్యోగు లకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం అందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి, పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పంట పండి స్తాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలకు సమ యం అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బక యిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ ప్రయత్నాలు సానుకూలపడ తాయి. ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యో గులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సా హంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ మాట చెల్లుబాటు అవుతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలు ఇస్తాయి. ఆదాయ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు ఢోకా ఉండదు. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని ఒత్తిడి పెరుగుతుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ప్రభావం పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగు లకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. జీవిత భాగ స్వామికి వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.



