- Telugu News Photo Gallery After 18 years, these four zodiac signs will face financial and health problems
జాగ్రత్త ..18 ఏళ్ల తర్వాత దరిద్రం పట్టనున్న దురదృష్ట రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక వలన కొన్ని రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే ఈ సారి 18 సంవత్సరాల తర్వాత దరిద్ర రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలగు రాశుల వారికి అష్టకష్టాలు తప్పవు అంటున్నారు పండితులు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 28, 2025 | 7:49 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కలయిక సహజం. అయితే ఆగస్టు నెలలో కొన్ని రాశుల వారికి చాలా సమస్యలు ఎదురు కానున్నాయి. ఎందుకంటే? ఆగస్టు నెలలో సూర్యుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో కేతవు సంచరిస్తున్నందున ఈ రెండు గ్రహాల కలయికతో దరిద్రయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం నాలుగు రాశులపై అధికంగా ఉండనున్నదంట.

సింహ రాశి : సింహ రాశి వారికి తన సొంత రాశిలో కేతువు, సూర్య గ్రహాల కలయిక వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి.ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రావడం, ఏ పని చేసినా అంది కలిసి రాకపోవడ వంటి వాటితో ఇబ్బందులు ఎదర్కొంటారంట. అందుకే వీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

మేష రాశి : మేష రాశి వారికి దరిద్ర యోగం ప్రభావంతో ఇంట్లో అశాంతి నెలకొంటుందంట. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురు అవుతాయంట. వ్యాపారల్లో నష్టాలు, కుటుంబంలో కలహాలతో సతమతం అవుతారంట. అంతే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతినే ఛాన్స్ ఉన్నదంట.

వృషభ రాశి : వృషభ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. సూర్య , కేతువుల కలయిక వలన వీరు ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో సతమతం అవుతారంట. ముఖ్యంగా ఆందోళన ఎక్కువ అవుతుందంట. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురు అవుతాయి. అందువలన వీరు చాలా జాగ్రత్తగా మెదలడం మంచిదంట.

ధనస్సు రాశి : సూర్య, కేతువు గ్రహాల కలయిక వలన దరిద్ర యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ధనస్సు రాశిపై అధికంగా ఉంటుందని చెబుతున్నారు పండితులు. దీంతో వీరికి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతారంట. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకోవాలంట.



