AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2025: జాతకంలో ఎన్ని దోషాలున్నా తలరాతను తిప్పి రాయగల పవర్ ఆయనదే.. ఉగాది నాడు ఈ ఆలయం ఎక్కడున్నా వెళ్లిరండి

కొత్త ఏడాది కోటి శుభాలను తేవాలని కోరుకుంటూ ఎంతో సంతోషంగా ఉగాదిని జరుపుకుంటుంటారు తెలుగు ప్రజలు. ఈ ఏడాదైనా గత తప్పిదాలు, సమస్యలు లేకుండా కొత్త జీవితాన్ని ఆకాంక్షిస్తుంటారు. విశ్వవసు నామ సంవత్సరం కోసం తెలుగు వాకిళ్లు రంగవళ్లులతో సిద్ధమవుతున్నాయి. అయితే, ఇదే సమయంలో పంచాంగ శ్రవణం వినడం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. కొందరికి ఈ ఏడాది ఎంతో శుభాల్ని ఇస్తుంటే మరికొన్ని రాశులకు అంత మంచి రోజులు కావంటూ కొందరు జ్యోతిష్యులు ఊదరగొడుతున్నారు. అయితే, జాతకం ఎలా ఉన్నా ఉగాది రోజున ఈ ఒక్క దేవుడిని దర్శిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు.

Ugadi 2025: జాతకంలో ఎన్ని దోషాలున్నా తలరాతను తిప్పి రాయగల పవర్ ఆయనదే.. ఉగాది నాడు ఈ ఆలయం ఎక్కడున్నా వెళ్లిరండి
Ugadi Must Visit Temple
Bhavani
|

Updated on: Mar 29, 2025 | 5:19 PM

Share

ముల్లోకాలకు దేవదేవుడు సూర్య భగవానుడే. ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే ఎన్నో రకాల దోషాలు తొలగుతాయని పండితులు చెప్తున్నారు. స్వామి వారిని ఉదయాన్నే దర్శించి పూజా కైంకర్యాలు నిర్వహిస్తే ఈ ఏడాదంతా ఎన్నో శుభాలను చూస్తారట. అంతేకాదు ఉగాది అంటేనే సూర్య భగవానుడికి సంబంధించిన పండగ. ఆయన మార్పుతోనే నవగ్రహాలు సరికొత్త ప్రాధాన్యతను సంతరించుకుని ఆయా వ్యక్తుల జాతకాలను నిర్ణయిస్తుంటాయి. అందుకే ఈ రోజున పంచాంగ శ్రవణం వింటుంటారు. ఉగాది ఈ ఏడాది ఆదివారం వస్తోంది. ఈ రోజుకు అధిపతి సూర్యుడు. కాబట్టి పండగ నాడు అందరూ(ద్వాదశ రాశులు, 27 జన్మ నక్షత్రాలు) సూర్యనారాయణ మూర్తి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలని అంటున్నారు. సూర్య దేవాలయానికి వెళ్లలేని వారు సూర్యుడి ఉప ఆలయాలకు వెళ్లినా మంచి జరుగుతుందని చెబుతున్నారు. సూర్యుడి ఉప ఆలయాలు అంటే ప్రధాన సూర్య దేవాలయాలు కాకుండా, ఇతర దేవాలయాలలో సూర్యుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠించి, పూజలు నిర్వహిస్తారు.

సూర్య భాగవానుడిని దర్శించలేని వారు…

ఎవరైతే ఈ ఆలయాలను దర్శించలేకుండా ఉన్నారో వారు ఇంట్లోనే ఆ చిన్నపాటి పని చేసి ఆ దేవదేవుడి ఆశీస్సులు పొందవచ్చు. ఉగాది రోజు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిగిన అక్షతలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు చెప్పి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేసిన సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని అంటున్నారు.

ఒకవేళ పైన చెప్పినవి ఏదీ చేయలేకపోయినా సూర్యుడికి అధిష్ఠాన దైవమైనా శ్రీమన్నారాణయ ఆలయాన్ని దర్శించుకోవాలని చెబుతున్నారు. అంటే ఇలా విష్ణు సంబంధమైన రామాలయం, నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకున్న మంచి జరుగుతుందని అంటున్నారు. కాబట్టి ఉగాది రోజు విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్లి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలని, అలాగే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 21 సార్లు చదవాలని అంటున్నారు.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి