Vastu Tips: ఇంట్లో ఉన్నట్టుండి నల్ల చీమలు దారకడితే దేనికి సంకేతం.. వీటి వల్ల మీకు జరగబోయేది ఇదే
మీ జీవితంలో జరగబోయే సానుకూల ప్రతికూల సంఘటనల గురించి చీమలు కొన్ని సూచనలు ఇస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం, చీమలు అదృష్టం సంపదతో ముడిపడి ఉంటాయి. అవి ఉన్నట్టుండి మీ ఇంట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయంటే అవి ఏదో విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని అర్థం. మరి చీమలు ప్రవర్తన వాటి వల్ల మనకు కలిగే శుభాశుభ ఫలితాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చీమలు అసాధారణంగా కష్టపడి పనిచేసేవి, అంకితభావం, నైపుణ్యం కలిగినవి. అన్నింటికంటే అత్యంత వ్యవస్థీకృత కీటకాలుగా వీటికి పేరుంది. అవి కఠినమైన నియమాలను పెట్టుకుని జీవిస్తాయి. జట్టుకృషిని నమ్ముతాయి ఎల్లప్పుడూ వాటి పనిలో నిమగ్నమై ఉంటాయి. వంటగది వంటి ప్రదేశాలలో మనం సాధారణంగా చీమల సమూహం మన ఇంట్లోకి రావడం వంటివి చూస్తుంటాం కానీ వాటిని పెద్దగా పట్టించుకోం. కానీ ప్రతి జంతువు లేదా పక్షి ప్రవర్తన వెనుక ఒక కథ ఉంటుందని మీకు తెలుసా?
ఎరుపు నలుపు చీమలు
నల్ల చీమలను చాలా శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి చుట్టూ నల్ల చీమలు తిరుగుతున్నట్లు మీరు చూస్తే, త్వరలో మీ సంపదలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అర్థం. మరోవైపు, ఎర్ర చీమలు దురదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు. ఇంట్లో ఎర్ర చీమలు అంటే సంపద కోల్పోవడాని సంకేతమంటారు.
స్థలం ముఖ్యం
బియ్యం పెట్టె నుండి నల్ల చీమలు బయటకు రావడం అంటే మీకు ఎక్కడి నుండో త్వరలో డబ్బు వస్తుందని అర్థం. మీరు మీ బంగారు ఆభరణాలను నిల్వ చేసే ప్రదేశాలలో చీమలు కనిపిస్తే, మీకు బంగారు వస్తువులు లభిస్తాయని సూచిస్తుంది.
దిశలు
చీమలు ఉత్తరం నుండి వస్తున్నట్లయితే అది ఆనందాన్ని సూచిస్తుంది అవి దక్షిణం నుండి వస్తున్నట్లయితే అది లాభాలను సూచిస్తుంది. తూర్పు నుండి వస్తున్న చీమలు అంటే మీరు కొన్ని ప్రతికూల వార్తలు వింటారు అవి పశ్చిమ దిశలో ఉంటే మీరు త్వరలో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎర్ర చీమలు
ఎర్ర చీమలు చెడు శకునాన్ని తెస్తాయని నమ్ముతారు. కాబట్టి మీరు వాటిని మీ ఇంట్లో చూసినట్లయితే, వెంటనే వాటిని తొలగించండి. అయితే, ఎర్ర చీమలు నోటిలో గుడ్లు పెట్టుకుని మీ ఇంటి నుండి బయటకు వెళితే అది మంచి సంకేతం.
నల్ల చీమలు
నల్ల చీమలు శుభప్రదమైనవిగా చెప్తారు. ఆనందం, శాంతి, శ్రేయస్సును సూచిస్తున్నప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో ఉండకూడదు. అవి మీ ఇంట్లో సంతానోత్పత్తి చేస్తుంటే, వాటికి బయటపడే మార్గాన్ని చూపించడానికి తగిన చర్యలు తీసుకోండి.