AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Budget: TTD వార్షిక బడ్జెట్ భారీగా కేటాయింపు .. ఏకంగా రూ.4411 కోట్లకు ఆమోదం

ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం నిర్వహిస్తామనీ, కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు.

Tirumala Budget: TTD వార్షిక బడ్జెట్ భారీగా కేటాయింపు .. ఏకంగా రూ.4411 కోట్లకు ఆమోదం
Ttd Budget
Surya Kala
|

Updated on: Mar 22, 2023 | 12:30 PM

Share

టీటీడీ వార్షిక బడ్జెట్.. రికార్డులు సృష్టించింది.  తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వార్షిక బడ్జెట్ కేటాయింపులతో సహా అనేక విషయాలు వెల్లడించారు. గత నెల 15వ తేదిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని చెప్పారు. 2023-24 సంవత్సరానికి రూ.4411 కోట్ల అంచనాతో బడ్జెట్ ను ఆమోదించినట్లు తెలియజేశారు. ఏప్రిల్ చివరి కల్లా తిరుపతిలోని శ్రీనివాస సేతు ప్రారంభిస్తామని వెల్లడించారు.

కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇక పై నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలిపారు. శ్రీవారి భక్తులు సౌకర్యార్థం రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.  తమిళనాడు రాష్ట్రం ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయించామన్నారు.

ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం నిర్వహిస్తామనీ, కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు. ఏఫ్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తులు రద్దీ దృష్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారీ చేసే వారు నియంత్రణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయ మార్పు విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తామని, త్వరలోనే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని తెలియజేశారు వై.వీ.సుబ్బారెడ్డి.

ఇవి కూడా చదవండి

REPORTER : ANIL

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..