- Telugu News Photo Gallery Spiritual photos Ugadi 2023: Sri Shobhakrut Nama Ugadi Asthanam will be ovserved in Tirumala temple
Ugadi-Tirumala: తిరుమలలో వైభవంగా ఉగాది ఉత్సవాలు.. శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం.. బంగారు వాకిలి వద్ద కనుల పండుగగా ఆస్థానం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని సన్నిధిలో తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు.
Updated on: Mar 22, 2023 | 8:54 AM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని సన్నిధిలో తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ తెల్ల వారు జాము నుంచే శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు.. ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను నిర్వహించారు.

శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు.

శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

బంగారు వాకిలి వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నైవేద్యం సమర్పణ చేయనున్నారు.

తరువాత స్వామివారి ముందు ఆగమ పండితులు, అర్చకులు పంచాగ శ్రవణం చేయడంతో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా ముగియనుంది.

ఉగాది పండుగ సందర్భంగా నేడు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను , వీవీఐ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఉగాది పర్వదినం పురష్కరించుకుని సోమవారం స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ నెల 30,31 తేదీల్లో శ్రీరామ నవమి..శ్రీరామ పట్టాభిషేకం నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది.

ఉగాది పండుగ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.




