Telugu News » Photo gallery » Spiritual photos » Baba Ramdev inaugurated the Shatakoti Hanuman campaign from the Swaminarayana Akshardham Temple, 300 Days Campaign Follows Till Opening Of Ayodhya Ram Temple
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వేదికగా అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సభలో శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం ఘనంగా ప్రారంభించారు వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు.
Mar 22, 2023 | 8:47 AM
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వేదికగా అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సభలో శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం ఘనంగా ప్రారంభించారు వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు.
1 / 8
దేశం నైతిక, గుణ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాధికారత కోసం అక్షరధామ్ ఆలయ వేదికపై వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు అందరూ సమావేశమై శ్రీరామ మందిర స్థాపనకు ముందు వందలాది హనుమాన్ చాలీసా పఠించాలని తీర్మానించారు. హనుమంతుని భక్తి స్ఫూర్తిని మేల్కొల్పాలని.. వాగ్యజ్ఞాన్ని భగవంతుని పాదాల చెంత అర్పించాలన్నారు. శ్రీరామ మందిర ప్రతిష్ఠ వరకు ఇదే ఆచారంగా కొనసాగుతుందని చెప్పారు.
2 / 8
అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామునిని ప్రతిష్టించే ఉత్సవం 2024, జనవరి 15న జరగనుంది. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ఏర్పాటు చేసిన భారీ సభలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని జనవరి 15, 2024 నుంచి భక్తులకు అందుబాటులోకి సభ నిర్వాహకులు వస్తుందని ప్రకటించారు. మార్చి 21, 2023 నుంచి జనవరి 15, 2024 వరకు 300 రోజుల పాటు గొప్ప భక్తి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు సభ నిర్వాహకులు. స్వామి నారాయణ అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సభ ద్వారా దేశ వ్యాప్తంగా సాంస్కృతిక చైతన్యాన్ని మేల్కొల్పేందుకు నాంది పలికారని పండితులు వ్యాఖ్యానించారు.
3 / 8
అక్షరధామ్ వేదికగా.. దేశంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, భాషల మధ్య నైతిక, గుణ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాధికారత కోసం సమిష్టిగా పునరుజ్జీవింపజేసే ప్రయత్నం చేశారు. సభకు హాజరైన ప్రముఖులంతా శతకోటి హనుమాన్ చాలీసా పథాన్ని భక్తితో పఠిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హనుమంతుడి భక్తి స్ఫూర్తిని మేల్కొల్పడానికి శ్రీరామ మందిరం ప్రారంభించడానికి ముందే.. సామూహిక దేశభక్తి, లోక సంక్షేమం, సోదర స్ఫూర్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
4 / 8
ఏడాదికాలం పాటు దేశ వ్యాప్తంగా వివిధ ఆధ్యాత్మిక ప్రసంగాలు, పుస్తక-వ్యాస రచన, సుందర్‌కాండ్‌పై ప్రసంగాలు, సమావేశాలు, ఆధ్యాత్మిక చర్చలు, పోటీలు, ఇతర భక్తి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
5 / 8
శ్రీ రామజన్మభూమి మందిర ప్రతిష్ఠాపనకు ముందు ప్రతి క్షణం శ్రీరాముడిని పూజించడం, స్మరించుకోవడం శతకొటి హనుమాన్ చాలీసా ప్రచారం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
6 / 8
ఇందుకోసం ‘rampratistha.com’ వెబ్‌సైట్‌ను, ‘రామ్-ప్రతిష్ఠ’ పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఇందులో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణాల సంఖ్యను ప్రతిజ్ఞ చేయవచ్చు. ఈ అప్లికేషన్‌లో హనుమాన్ చాలీసా దాదాపు 12 భాషలలో అందుబాటులో ఉంటుంది.
7 / 8
బాబా రామ్‌దేవ్, గోవిందదేవ్ గిరి, భద్రేష్‌దాస్‌ల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక గురువులు, పండితులు పాల్గొన్నారు.