- Telugu News Photo Gallery Spiritual photos Ugadi 2023: if this is cut on the threshold of ugadi day there will be no shortage of money throughout this year
Ugadi 2023: ఉగాదికి బూడిద గుమ్మడికాయను ఇలా కట్టుకోండి.. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ..
తెలుగునూతన సంవత్సరాది ఉగాది. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం మార్చి 22వ తేదీన జరుపుకోనున్నారు. పండగ వచ్చిందంటే చాలు తెలుగువారి లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇంటిని మామిడి తోరణాలు, బంతిపువ్వులతో అందంగా అలంకరిస్తారు. అంతేకాదు ఉగాది పండగ రోజున చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందా..
Updated on: Mar 24, 2023 | 8:11 AM

తెలుగునూతన సంవత్సరాది ఉగాది. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం మార్చి 22వ తేదీన జరుపుకోనున్నారు. పండగ వచ్చిందంటే చాలు తెలుగువారి లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇంటిని మామిడి తోరణాలు, బంతిపువ్వులతో అందంగా అలంకరిస్తారు. అంతేకాదు ఉగాది పండగ రోజున చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందా..

ఉగాది పర్వదినం మార్చి 22వ తేదీన జరుపుకోనున్నారు. పండగలు వచ్చాయంటే చాలు తెలుగువారి లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇంటిని మామిడి తోరణాలు, బంతిపువ్వులతో అలంకరిస్తారు. వాకిలిని రంగు రంగుల ముగ్గులతో అలంకరిస్తారు.

తెల్లవారు జామునే నిద్ర లేచి అభ్యంగస్నానమాచరించి.. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. సూర్యుభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. దేవుడికి పూజ చేసిన అనంతరం పువ్వు పచ్చడిని తయారు చేసుకోవాలి

అనంతరం ఉగాది సందర్భంగా.. వేప పువ్వుతో ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి.. అనంతరం కుటుంబ సభ్యులందరూ ఉగాది పచ్చడి తీసుకుంటాం.

ప్రకృతికి మనిషి మధ్య విడదీయరాని బంధం ఉంది. ఉగాది వస్తూ ప్రకృతిలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కనుక ఈ పండగ అక్షరాలా ప్రకృతి పండగ. ఉగాదితో శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి అడుగు పెడతాం.. ఎండిన మొక్కలు చిగురిస్తాయి. వసంత గానంతో పులకిస్తాయి.

కొందరు ఉగాది ముందు రోజు అంటే కొత్త అమావాస్య రోజున ఇంటికి బూడిద గుమ్మిడికాయను కట్టుకుంటారు.

మరికొందరు ఉగాది రోజు సూర్యోదయానికి ముందు ఇంటి ప్రధాన ద్వారానికి ముందు బూడిద గుమ్మిడి కాయను కడతారు

ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ.. పాజిటివ్ ఎనర్జీ గా మారుతుందని విశ్వాసం. అయితే ఈ దిష్టి గుమ్మడికాయని ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి కట్టకూడదు.




