Tirumala: శ్రీవారి ఆలయంలో వేసవిలో భక్తుల రద్దీ.. మెరుగైన సేవలకు విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న టీటీడీ..

మే 1 నుండి జులై 15వ తేదీ వరకు యాత్రికుల అవసరాలను తీర్చడానికి ఆయా సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. తిరుమలకు జూలై 15వ తేదీ వరకు డిప్యూటేషన్‌పై వచ్చే సంబంధిత అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారివారికి విధులు కేటాయించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ.. సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

Tirumala: శ్రీవారి ఆలయంలో వేసవిలో భక్తుల రద్దీ.. మెరుగైన సేవలకు విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న టీటీడీ..
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2023 | 8:47 AM

పిల్లలకు పరీక్షలు అయ్యాయి.. వేసవి సెలవులు మొదలయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తిరుమల తిరుపతి క్షేత్రానికి పయనం అవుతారు. దీంతో వేసవి సెలవులు వస్తే చాలు.. శ్రీవారి క్షేత్రం రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ రెడీ అవుతోంది. ఇదే విషయాన్నీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తిరుమలలోని అన్నమయ్యభవనంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.

మే 1 నుండి జులై 15వ తేదీ వరకు యాత్రికుల అవసరాలను తీర్చడానికి ఆయా సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. తిరుమలకు జూలై 15వ తేదీ వరకు డిప్యూటేషన్‌పై వచ్చే సంబంధిత అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారివారికి విధులు కేటాయించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ.. సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే క్యూ లైన్లు, వైకుంఠం కాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లలో తాగు నీరు, అన్నప్రసాదం తదితర సేవలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత విభాగాధిపతులను ఆదేశించారు.

భక్తుల రద్దీకి తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచనున్నామని తెలిపారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పిఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తిరుమలలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని కీలక ప్రదేశాల్లో భక్తులకు సేవలు అందించేందుకు తగిన సంఖ్యలో శ్రీవారి సేవకులను సిద్ధం చేయాలని పిఆర్ఓ డాక్టర్‌ టి.రవిని ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదం, నీరు, లడ్డూ ప్రసాదాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది పరిశీలించేందుకు శ్రీవారి సేవా పర్యవేక్షకులను కేటాయించాలని, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు సంబంధిత శాఖకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఈఓ ఆదేశించారు.

అనంతరం దర్శనానికి వచ్చే భక్తులకు వెండి వాకిలి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడంపై వివరంగా చర్చించారు. టీటీడీ విశ్రాంత సీఈ, టీటీడీ సలహాదారు శ్రీరామచంద్రారెడ్డి, రద్దీ నిర్వహణలో అపారమైన పరిజ్ఞానం, అనుభవం ఉన్న శ్రీవారి ఆలయ విశ్రాంత డిప్యూటీ ఈఓ శ్రీ ప్రభాకర్‌రెడ్డి కలిసి ఈ సమస్యను అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళికను రెండ్రోజుల్లో అందించాలని ఈవో ధర్మారెడ్డి కోరారు.

వేసవి కాలంలో తిరుమలకు విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించాలని తిరుమల పోలీసులను ఈఓ కోరారు. వేసవిలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై విభాగాల వారీగా పలు సూచనలు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..