AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Online Tickets: తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెరిగిన పోటీ.. కేవలం 8 నిమిషాల్లో 10 వేల టికెట్ల అమ్మకం

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో భక్తులంతా శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ టీటీడీ అధికారులు మాత్రం లిమిటెడ్ దర్శనాలు కల్పిస్తున్నారు..ఇదిలావుంటే ప్రత్యేక దర్శనం కోసం విడుదల చేసిన 10 వేల టికెట్లు 8 నిమిషాల వ్యవధిలోనే బుక్‌ అయ్యాయి.

TTD Online Tickets: తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెరిగిన పోటీ.. కేవలం 8 నిమిషాల్లో 10 వేల టికెట్ల అమ్మకం
Tirumala Temple
Sanjay Kasula
|

Updated on: Jul 09, 2021 | 9:09 PM

Share

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది TTD. ఈ నెల 13, 16 తేదీలకు సంబంధించిన రూ.300ల టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు మొత్తం 10 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టింది. కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే అన్నీ బుక్‌ అయిపోయాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తుల దర్శనాన్ని రోజుకు ఐదు వేలకే పరిమితం చేశారు టీటీడీ అధికారులు. అయితే జులై నెలలో 13, 16 తేదీలకు సంబంధించిన కోటాను ‘https://tirupatibalaji.ap.gov.in/ ’ అనే వెబ్ సైట్ ద్వారా విడుదల ఒకేసారి విడుదల చేశారు. గత ఏడాది కరోనా తీవ్రత ప్రారంభం కాగానే చాలా రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేశారు అధికారులు.

ఆ తర్వాత నాలుగు నెలల పాటు రూ.300 నుంచి రూ.10 వేల రూపాయల వరకు టికెట్లు కొనుగోలు చేసింది. కరోనా రెండో దశ ఉద్ధృతి వల్ల ఏప్రిల్‌ 11 నుంచి ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తుల కోసం జారీ చేసే సర్వదర్శనంటోకెన్ల జారీ కేంద్రాలను మూసేశారు. కానీ ఆన్‌లైన్‌ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల జారీని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను విక్రయిస్తూ దర్శనాలు కల్పిస్తున్నారు.

కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా టీటీడీ అధికారులు సర్వదర్శనం తిరిగి ప్రారంభించలేదు.. కానీ VIP సిఫార్సు లేఖలపై VIP బ్రేక్‌ దర్శన టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, బ్రేక్‌ దర్శనాలు… ఇలా వివిధ రూపాల్లో డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసినవారు రోజుకు 18 నుంచి 20 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు.

తాజాగా గురువారం 17,736 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, VIP బ్రేక్‌ దర్శనాలను కొనసాగిస్తున్న TTD… సర్వదర్శనం టోకెన్లు జారీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సాధారణ భక్తులు స్వామి వారి దర్శనానికి నోచుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి: Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ