Bhagavad-Gita: ప్రపంచంలో ఏ మత గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.. అది ఏమిటంటే

Bhagavad-Gita: లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ.. లోకానికి మంచి చేయడం కోసం జన్మించిన అవతారపురుషులను, మహర్షులను, మహానుభావులను తలచుకుంటూ.. వారి చేసిన మహోపకారానికి..

Bhagavad-Gita: ప్రపంచంలో ఏ మత గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.. అది ఏమిటంటే
Bhagavad Gita
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Jul 17, 2021 | 4:48 PM

Bhagavad-Gita: లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ.. లోకానికి మంచి చేయడం కోసం జన్మించిన అవతారపురుషులను, మహర్షులను, మహానుభావులను తలచుకుంటూ.. వారి చేసిన మహోపకారానికి కృతజ్ఞత తెలుపుతూ.. వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జయంతిని జరుపుకుంటాం… అయితే ఒక పుస్తకానికి కూడా జయంతి వేడుకలను నిర్వహిస్తాం.. ఇలా ప్రపంచంలో ఏ ఇతర మతగ్రంథాలకు కూడా లేదు.. ఆ పుస్తకమే భగవద్గీత. లోకానికి గీత వలన జరిగిన మహోపకారానికి గుర్తుగా గీతాజయంతి ని జరుపుకుంటాం. అయితే ఈ రోజు భగద్గీత వలన లోకానికి కలిగిన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం

సుమారు 5200 సంవత్సరాల క్రితం సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా “గీత” అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని “గీతోపనిషత్తు” అని కూడా అంటారు.

భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని “నా కర్తవ్యమేమి?” అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తి.

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్

భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. ఇస్కాన్ వారు భగవద్గీత ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల మంది కృష్ణ భక్తులుగా మారారు.

Also Read: Corona Third Wave: అమెరికా , ఇండోనేషియా, స్పెయిన్ , రష్యా దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం .. భారీగా కేసులు నమోదు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu