Corona Third Wave: అమెరికా , ఇండోనేషియా, స్పెయిన్ , రష్యా దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం .. భారీగా కేసులు నమోదు

Corona Third Wave: ఎప్పుడు ఏ సమయంలో కరోనా వెలుగులోకి వచ్చిందో కానీ.. ఎన్ని నెలలు అయినా మనవాళిపై పంజా విసురుతూనే ఉంది. రకరకాల రూపాలను సంతరించుకుని దేశ విదేశాల్లో..

Corona Third Wave: అమెరికా , ఇండోనేషియా, స్పెయిన్ , రష్యా దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం .. భారీగా కేసులు నమోదు
Third Wave
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 17, 2021 | 4:08 PM

Corona Third Wave: ఎప్పుడు ఏ సమయంలో కరోనా వెలుగులోకి వచ్చిందో కానీ.. ఎన్ని నెలలు అయినా మనవాళిపై పంజా విసురుతూనే ఉంది. రకరకాల రూపాలను సంతరించుకుని దేశ విదేశాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే మెక్సిలో థర్డ్ వేవ్ అడుగు పెట్టగా పాకిస్థాన్ లో ఫోర్ట్ వేవ్ కల్లోలం సృష్టిస్తుందని ఆ దేశ అధికారులు ప్రకటించారు.. తాజాగా అమెరికాలో కూడా థర్డ్ వేవ్ కేసులు నమోదయ్యాయి. గత 25 రోజుల్లో కొత్త కేసులు 350 శాతం నమోదవుతున్నాయి. అమెరికాలో వ్యాక్సిన్ 48 శాతం జరిగినా గత 11 రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆసియా ఖండంలో ఇండోనేషియాలో థర్డ్ వేవ్ లో భారీగా కేసులు నమోదవుతూన్నాయి. మూడు రెట్లు ఎక్కువగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

అమెరికాలో 19 రాష్ట్రాల్లో కొత్తగా రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాస్ ఏంజిల్స్‌, దక్షిణ కాలిఫోర్నియాల్లో ఇండోర్‌ల్లోనూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ తో 10 కోట్ల మందికి ముప్పు పొంచి ఉందని మిన్నెసోటా యూనివర్సిటీలోని శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానించారు. మరోవైపు స్పెయిన్ దేశంలో సగానికి పైగా జనాభా కరోనా మహమ్మారి భారిన పడ్డారు. తొలిసారిగా 44 వేల కేసులు నమోదయ్యాయి.

ఫ్యాన్స్ లో న్యూ బేటా వేరియంట్ వైరస్ వెలుగు చూడటంతో వివిధ దేశాల వారు ఫ్రాన్స్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలువిధిస్తున్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాలో తొలి బేటా వేరియంట్ కేసు నమోదయ్యాయింది. ఇక ఆసియా ఖండంలో తాజా హాట్‌స్పాట్‌గా ఇండోనేషియా ఉంది. భారత్‌లో కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గురువారం భారత్‌లో 39,071 కొత్త కేసులు నమోదైతే, ఇండోనేషియాలో 56,757 మందికి కరోనా సోకింది. మరో ఆసియా దేశం రష్యాలో డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే రష్యా వాసులు తాము వ్యాక్సినేషన్ వేయించుకోమని తేల్చి చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కొవిడ్ బారిన పడిన దేశాల్లో రష్యా 5వ స్థానంలో ఉంది.

Also Read: Itchy Eyes Remedies: సెల్, ల్యాప్‌టాప్‌లు ఎక్కువ యూజ్ చేస్తున్నారా.. కళ్ళకు ఉపశమనం కోసం ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!