Female Bodybuilder Dies: చెమట పట్టకుండా చేసినా సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయిన బాడీ బిల్డర్ మోనా
Female Bodybuilder Dies: కొన్ని కొన్ని సర్జరీలు ప్రాణాల మీదకు వస్తుంటాయి. అందం కోసమో.. బాడిలో కొవ్వు తగ్గించుకునేందుకో అలా రకరకాల సర్జరీలు చేయించుకోవడం వల్ల.
Female Bodybuilder Dies: కొన్ని కొన్ని సర్జరీలు ప్రాణాల మీదకు వస్తుంటాయి. అందం కోసమో.. బాడిలో కొవ్వు తగ్గించుకునేందుకో అలా రకరకాల సర్జరీలు చేయించుకోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెక్సీకోలో ఓ మహిళ బాడీ బిల్డర్ చేసుకున్న సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయారు. చెమట పట్టకుండా చేసినా సర్జరీ వికటించి మెక్సికోలో బాడీ బిల్డర్ మోనా మరణించారు. మెక్సికోలోని గ్వాడాలజారాలోని ఒక క్లినిక్‌లో అండర్ ఆర్మ్ చెమటను తగ్గించే ప్రక్రియలో భాగంగా ఒడాలిస్ సాంటోస్ మోనా మరణించారు.
మిరాడ్రీ అనే చికిత్సను ప్రోత్సహించడానికి 23 ఏళ్ల యువకుడిని స్కిన్‌పీల్ క్లినిక్ నియమించినట్లు తెలుస్తోంది. అయితే చెమట గ్రంథులను తొలగించడానికి ఉష్ణ శక్తిని ఉపయోగించడం ద్వారా ఈ చికిత్స పని చేస్తుంది. శస్త్ర చికిత్స సమయంలో ఆమె చెమట గ్రంథులను తొలగించడం ద్వారా ఆమె అండర్ ఆర్మ్ చెమట చికిత్సకు ఒడాలిస్ ప్రక్రియ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అనస్థీషియా మత్తుమందు ఇచ్చిన తర్వాత ఆమెకు గుండెపోటు రావడంతో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఆమెను బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. అయితే ఆమె మరణించడానికి అనస్థీషియా, స్టెరాయిడ్ కారణం కావచ్చని అధికారులు చెబుతుండగా, ఆమె మరణంపై దర్యాప్తు జరుపుతున్నారు. 2019లో మిస్, మిస్టర్ టైటిల్‌తో పాటు వెల్‌నెస్ ఫిట్‌నెస్ జువెనైల్ పోటీల్లో కూడా గెలుపొందినట్లు టైటిల్ కైవసం చేసుకున్నట్లు ది సన్ మీడియా నివేదించింది.
View this post on Instagram