Breaking News : Go Maha Garjana ‘గో మహా గర్జన’కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్, ఇక, ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియంలో..‌

Go Maha Garjana : 'గో మహాగర్జన'కు మార్గం సుగమం అయింది. శ్రీ తులసి ఫౌండేషన్ హైదరాబాద్‌ లో నిర్వహించ తలపెట్టిన..

Breaking News : Go Maha Garjana 'గో మహా గర్జన'కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్, ఇక,  ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియంలో..‌
Cow Maha Gharjana
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 30, 2021 | 4:23 PM

Go Maha Garjana : ‘గో మహాగర్జన’కు మార్గం సుగమం అయింది. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియం లో నిర్వహించ తలపెట్టిన గో మహా గర్జనకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీన గో సంరక్షణ కోసం యగ తులసి ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న ‘గో మహా గర్జన’ కార్యక్రమానికి అడ్డంకులు తొలగిపోయాయి.

కాగా, గో మహాగర్జనకు పర్మిషన్ రద్దు కావడంతో ఎన్టీఆర్ స్టేడియం లో నిన్న నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నల్లబ్యాడ్జీలు ధరించి, దీపాలు వెలిగించిన యుగ తులసి ఫౌండేషన్ సభ్యులు… ప్రభుత్వం పునరాలోచించి యధావిధిగా పర్మిషన్ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఈ ఉదయం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని గో బంధువులకు సూచనలు కూడా ఇచ్చారు. దీంతోపాటు, అనుమతికోసం యుగ తులసి ఫౌండేషన్ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఫలితంగా కోర్టునుంచి గో మహా గర్జనకు అనుమతి లభించింది.

Read also : అక్కడ మరింత అందంగా : హోలీ వేళ లంబాడీ, ఆదివాసుల రంగుల వేడుకలు.. ఆదిలాబాద్ జిల్లా అడవులకే అందానిస్తున్నాయ్..