AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishno Devi Donations: కోరిన వరాలిచ్చే వైష్ణవి దేవికి 20 ఏళ్లలో భక్తులు 1,800కేజీల బంగారం కానుకలు.. మరి నగదు, తెలిస్తే షాక్

ప్రముఖ హిందూ ఆలయాల్లో ఒకటి వైష్ణవీదేవి ఆలయం. అతిపురాతనమైన ఈ ఆలయంలో మొదటిగా ప్రాండవులు కాలంలో పూజలు జరిగాయని కథనం.. భక్తుల న్యాయమైన కోర్టికలను తీర్చే కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన వైష్ణవీదేవిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే 1986 ముందు ఎక్కువగా ఈ దేవతను పురుషులు మాత్రమే ఆరాధించేవారు

Surya Kala
|

Updated on: Mar 30, 2021 | 1:45 PM

Share
 జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వత మీద పురాతన గుహలో వైష్ణవి దేవి ఆలయం ఉంది. ఇక్కడ వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. తనను దర్శించే భక్తులు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. అమ్మవారి దర్శనానికి సంవత్సరం పొడుగునా  భారీ సంఖ్యలో   ఎక్కడెక్కడినుంచో వస్తారు. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం

1 / 5
ఈ వైష్ణో దేవి 1986 లో పుణ్యక్షేత్రం గా ఏర్పడింది. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బోర్డు నిర్వహిస్తుంది. ఇక గత 20 ఏళ్లలో (2000-2020) అమ్మవారికి విరాళంగా 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండితో పాటు రూ .2,000 కోట్ల నగదు లభించింది. కుమావున్‌కు చెందిన కార్యకర్త హేమంత్ గౌనియా ఆర్టీఐ దాఖలు చేసిన సందర్భంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

2 / 5
ఈ విరాళాలు కత్రా శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు బదిలీ చేశారు. ఇక గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. వైష్ణవీదేవికి భారీగా బంగారం, వేడిని, నగదు ను మొక్కులుగా చెల్లించుకుంటున్నారు. అయితే ఇంత మొత్తంలో ఉంటుందని తాము ఊహించలేదని ఆలయ నిర్వాహకులు చెప్పారు.

3 / 5

అయితే గత కొన్నేళ్లుగా వైష్ణవిదేవిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరగగా.. కరోనా సమయంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పుణ్య క్షేత్రాన్ని 2000 లో 50 లక్షల మంది దీనిని సందర్శించగా, 2018 మరియు 2019 రెండింటిలో ఈ సంఖ్య 80 లక్షలకు పెరిగింది. అయితే, 2020 లో కేవలం 17 లక్షల మంది మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శించారు. 78శాతం భక్తుల సంఖ్య తగ్గింది.

4 / 5
అయితే వైష్ణవి మాత కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని 2011 మరియు 2012 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటక  దర్శించారు. సుమారు కోటి మంది ప్రజలు  సందర్శించారు. అయితే 2020 లో కేవలం 17 లక్షల మంది మాత్రమే ఈ మందిరాన్ని సందర్శించారు. కరోనా ప్రభావం ఇది పర్యాటక రంగంపై  పూర్తిగా పడడంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆలయ సిబ్బంది చెప్పారు.

5 / 5