AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఔరా అద్భుతం.. ! ఒళ్లంతా శులాలు గుచ్చినా.. ఒక్క రక్తపు బొట్టు చిమ్మితే ఒట్టు..!! ఇదెక్కడి వింతో తెలుసా..?

ఈ ఉత్సవాలకు ముందు సుబ్రహ్మణ్య స్వామి దీక్ష చేపట్టి, స్వామి వారి జయంతి రోజు ఇలా పూజలు చేసి దీక్షలను విరమిస్తారు. రథోత్సవంలో కోవళిలతో చేసిన నృత్యాలు అందరిని అక్కట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో

ఔరా అద్భుతం.. ! ఒళ్లంతా శులాలు గుచ్చినా.. ఒక్క రక్తపు బొట్టు చిమ్మితే ఒట్టు..!!  ఇదెక్కడి వింతో తెలుసా..?
Sri Subrahmanyeswara Swamy
Jyothi Gadda
|

Updated on: Apr 05, 2023 | 5:09 PM

Share

ఔరా.. అనే దృశ్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.. ఒళ్ళు జలదరించేలా చేశాయి. తమ ఇష్టమైన దేవుగా పట్ల తబకుండే భక్తి భావాన్ని చాటుకునే విధానం వేలాది మందిని ఆకర్షించింది. హర…హర…అంటూ హరనామస్మరణలు చేస్తూ పదునైన ఇనుప కొక్కిల్లు, అస్త్రాలు, విపుకు, బుగ్గలకు, కుచ్చుకొని తమిళులు తమ భక్తిని చాటుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ సుబ్రమణ్య స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ పాత ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉదయం నుండే భక్తుల కోలాహలం నెలకొంది.

తమిళులు పెద్ద సంఖ్యలో చేరుకొని జమ్మి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే బుగ్గలకు, విపుకు పదునైన ఇనుప కొక్కిల్లు, అస్త్రాలు, కుచ్చుకొని హరోం.. హర…ఓం నమశివయ్య.. అంటూ ఆ శివనామాన్ని జపిస్తూ.. తమిళులు తమ భక్తిని చాటుకుంటు పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు. చూసే వారికి ఒళ్ళు గగ్గుర్లు పుట్టెల మహిళలు, పిల్లలు, సైతం శూలాలు గుచ్చుకుని తమ భక్తిని చాటుకున్నారు. అలా రథోత్సవంలో శులాలు గుచ్చుకోవడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. కానీ, ఆ శూలాలు గుచ్చే క్రమంలో రక్తం బొట్టు కూడా బయటకు రాకపోవడం ఇక్కడి విశేషం.

ఇవి కూడా చదవండి

శూలాలు కుచ్చుకున్న వారికి నొప్పి తెలియకుండా స్వామి వారి విభూతి పూసుకొని భక్తులు తమిళులు ముందుకు వెళుతారు. ఈ ఉత్సవాలకు ముందు సుబ్రహ్మణ్య స్వామి దీక్ష చేపట్టి, స్వామి వారి జయంతి రోజు ఇలా పూజలు చేసి దీక్షలను విరమిస్తారు. రథోత్సవంలో కోవళిలతో చేసిన నృత్యాలు అందరిని అక్కట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.