మాజీ ప్రియురాలి కోసం మంచులో.. 21 గంట‌ల పాటు మోకరిల్లిన ప్రేమికుడు..!

అందుకే ఆమెకు ఇలా క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు. పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అతను వారి మాటలను కూడా ఏ మాత్రం అంగీకరించలేదు.

మాజీ ప్రియురాలి కోసం మంచులో.. 21 గంట‌ల పాటు మోకరిల్లిన ప్రేమికుడు..!
Begs Ex Girlfriend
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 05, 2023 | 4:45 PM

ప్రేమ భావన మనసుకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి విడిపోవడం చాలా కష్టమైన విషయం. చిన్న సమస్యకైనా, పెద్ద సమస్యకైనా విడిపోయినా మనసులో ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. పోగొట్టుకున్న ప్రేమను తిరిగి పొందడానికి అబ్బాయిలు, అమ్మాయిలు వివిధ మార్గాల్లో సర్కస్ చేస్తారు. తమ ప్రేమను, ప్రేమించిన వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రేమికుడు తన మాజీ ప్రియురాలి కోసం ఎవరూ చేయని సాహాసం చేశాడు. తనను విడిచిపెట్టిన లవర్‌ కోసం చలిలో, గాలిలో ఆమె కోసం ఎదురుచూడసాగాడు. అలా గంట, రెండు గంటలు కూడా కాదు. అతను మోకరిల్లి 21 గంటల పాటు ప్రేమకోసం నిరీక్షించాడు. ఈ ఘటన నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఆ ప్రేమికుడు శరీరం గడ్డకట్టే చలిలో చేతిలో పుష్పగుచ్ఛంతో మోకరిల్లాడు.

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని డజౌలో మార్చి 28 మధ్యాహ్నం 1 నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఒక మహిళ కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం వెలుపల ఒక వ్యక్తి గులాబీల గుత్తితో మోకరిల్లాడు. చల్లటి వాతావరణం కారణంగా ఆ వ్యక్తి కదలకుండా కూర్చున్నాడు. సమయం గడిచేకొద్దీ వాతావరణం మరింత దిగజారినప్పటికీ తన అభ్యర్థన విరమించుకోలేదు. చుట్టూ గుమిగూడిన ప్రజలు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని అతన్ని కోరారు. ఎవరూ చెప్పినా అతడు వారి మాటలు వినలేదు.. ఆ వ్యక్తి తన మాజీ ప్రియురాలి కోసం ఎదురు చూడసాగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే…

కొద్ది రోజుల క్రితం అతని మాజీ ప్రియురాలు అతన్ని విడిచిపెట్టింది. అందుకే ఆమెకు ఇలా క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు. పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అతను వారి మాటలను కూడా ఏ మాత్రం అంగీకరించలేదు. అలాంటి ప్రేమపూర్వక ప్రవర్తనను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!