ఈ రోజు సూర్యగ్రహణం నీడలో శని అమావాస్య.. శనీశ్వర అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే
ఈ రోజు శనివారం.. పాల్గుణ మాసం అమావాస్య తిధి. హిందూ మతంలో శని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శనీశ్వరుడు ఆరాధనకు, పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం వలన భక్తుల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈసారి శని అమావాస్య, సూర్యగ్రహణం ఒకే రోజున వస్తున్నాయి. అంతేకాదు ఈ రోజు శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ నేపధ్యంలో శనిశ్వరుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలను చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

శని అమావాస్య ప్రత్యేక రోజు. ఈ రోజు అమావాస్య, శనివారం కలిసి వస్తాయి. ఈ రోజున శనీశ్వరుడు ప్రత్యేకంగా పూజించడం ద్వారా.. శని దోషం, ఏలి నాటి శని, శని ధైయా నుంచి ఉపశమనం లభిస్తుంది. జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా ఉన్నా.. లేక పీడితంగా ఉన్నవారికి కూడా ఈ రోజు ముఖ్యమైనది.
శని అమావాస్య ఎప్పుడు?
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం శని అమావాస్య మార్చి 29న వచ్చింది. ఈ రోజున శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. పాల్గుణ మాసంలో అమావాస్య తిధి మార్చి 28న సాయంత్రం 7:55 గంటలకు మొదలైంది. ఈ తిధి మార్చి 29న సాయంత్రం 4:27 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం శని అమావాస్య మార్చి 29న జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇది మొదటి శని అమావాస్య. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కూడా ఈ రోజున ఏర్పడుతుంది.
శని అమావాస్య రోజున చేయవలసిన పరిహారాలు
- శనీశ్వరుడికి ఆవాల నూనె, నల్ల నువ్వులు, మినపప్పు సమర్పించండి.
- ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
- రావి చెట్టుకు నీళ్ళు సమర్పించి, ఆవ నూనెతో లేదా నువ్వుల నూనె తో దీపం వెలిగించండి.
- హనుమాన్ చాలీసా పారాయణం చేసి, హనుమంతుడికి మల్లె నూనెను సమర్పించండి.
- పేదలకు, అవసరంలో ఉన్నవారికి ఆహారం, బట్టలు, నూనె దానం చేయండి.
- శని అమావాస్య రోజున సూర్యుడు, శని కి సంబంధించిన మంత్రాలను జపించండి.
- ఓం శం శనిచారాయ నమః అనే శనిశ్వర మంత్రాన్ని పఠించండి.
- ఓం ఘృణిః సూర్యాయ నమః సూర్య అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి.
శని అమావాస్య ప్రాముఖ్యత
శని అమావాస్య రోజున శనిదేవుడిని పూజించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. శని దోషం, ఏలి నాటి శని, శని ధైయా ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. కనుక ఈ రోజున పూర్వీకుల శాంతి కోసం పూజలు కూడా చేస్తారు. శనిదేవుడిని కర్మలకు న్యాయనిర్ణేతగా పరిగణిస్తారు.. కనుక ఈ రోజున మంచి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఎవరి జాతకంలోనైనా శని అశుభ స్థితిలో ఉంటే.. ఈ రోజున ఆయన్ని పూజించడం వల్ల శాంతి కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు