AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana: జీవితంలో ఈ పనులు చేయండి.. మరణం తర్వాత మోక్షానికి మార్గం సులభం

మన పురాణాల్లో గరుడ పురాణానికి ప్రత్యేక స్థానం ఉంది. విష్ణువు గరుత్మంతుడికి చెప్పిన పురాణం గరుడ పురాణం. ఇందులో జీవి , ఆత్మ ప్రయాణం.. ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను గురించి చెబుతుంది. అంతేకాదు దీనిలో నరకానికి దారితీసే కర్మలను, స్వర్గానికి దారితీసే కర్మలను.. విముక్తి, మోక్షానికి దారితీసే కర్మలను వివరిస్తుంది. గరుడ పురాణం విష్ణువు.. తన వాహనమైన పక్షి రాజు గరుడ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా వ్యాస మహర్షి రచించిన పురాణం. ఇందులో వ్యక్తి తన జీవితకాలంలో చేసే కర్మల వలన ఆత్మకు ముక్తి లభిస్తుందని అంటారు.

Garuda Purana: జీవితంలో ఈ పనులు చేయండి.. మరణం తర్వాత మోక్షానికి మార్గం సులభం
Garuda Puranam
Surya Kala
|

Updated on: Mar 29, 2025 | 9:00 AM

Share

హిందూ మతంలో 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఇందులో మనిషి జనన, మరణానికి సంబంధించిన అనేక రహస్యాలను ప్రస్తావిస్తుంది. ఈ ముఖ్యమైన పురాణం పాపాలు, పుణ్యాలు, కర్మలను కూడా వివరిస్తుంది. ఏ కర్మ నరక ప్రయాణానికి దారితీస్తుందో.. ఏ కర్మలు స్వర్గవాసానికి దారితీస్తాయో.. ఏ కర్మలు ముక్తికి, విముక్తికి దారితీస్తాయో వివరించబడింది. గరుడ పురాణం ఈ పురాణం విష్ణువు, అతని వాహనమైన పక్షి రాజు గరుత్మంతుడు మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా రచించబడిన గ్రంథం.

జీవి కర్మల నుంచి విముక్తి కోసం జీవితంలో ఏ పనులు చేయాలంటే

హిందూ మతంలో ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం మోక్ష సాధనంగా పరిగణించబడుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం.. ఏకాదశి పూజ ప్రాముఖ్యతను గురించి గరుడ పురాణంలో కూడా వివరించబడింది, దీని ప్రకారం.. ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వ్యక్తి తన పాపాలన్నింటినీ పోగొట్టుకుని మోక్షాన్ని కూడా పొందుతాడు.

గరుడ పురాణం ప్రకారం కలియుగంలో గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షానికి ద్వారం తెరుచుకుంటుంది.

ఇవి కూడా చదవండి

తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. గరుడ పురాణంలో తులసి ఒక ముఖ్యమైన భాగంగా వర్ణించబడింది. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే.. మరణానంతరం మోక్షం లభిస్తుంది. మరణం ఆసన్నం అయిన మనిషి నోట్లో తులసి నీరు పోయడం వలన ఆ వ్యక్తికి మోక్షానికి ద్వారాలు తెరుచుకుంటాయని కూడా నమ్ముతారు.

గరుడ పురాణం ప్రకారం.. మనిషి ఎల్లప్పుడూ శ్రీ హరి నామాన్ని జపించాలి. అలాగే జీవితాంతం నారాయణుడి పేరుని జపిస్తూ.. దశావతారాలను పూజిస్తే.. మోక్షం లభిస్తుంది. మరణించే ముందు నారాయణుడి పేరుని తలచినా చేసిన పాపాలు పోయి.. వైకుంఠం చేరుకుంటారని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..