AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samudrik Shastra: స్త్రీ, పురుషులలో కుడి కన్ను అదిరితే సంకేతం ఏమిటి? ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే..

హిందూ ధర్మంలో మనిషి చేసే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కర్మల అనుసరించి జీవితం నడుస్తుందని నమ్మకం. అంతేకాదు హిందువులు జ్యోతిష్యం, వాస్తు, శకునం వంటి అనేక శాస్త్రాలను అనుసరించి జీవిస్తారు. అలాంటి నమ్మకాల్లో ఒకటి కన్ను ఆదరడం ఒకటి. సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ పురుషులకు కుడి కన్ను అదిరితే దాని అర్ధం ఏమిటి? భవిష్యత్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలుసుకుందాం..

Samudrik Shastra: స్త్రీ, పురుషులలో కుడి కన్ను అదిరితే సంకేతం ఏమిటి? ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే..
Reasons Behind Twitching Of Eyes
Surya Kala
|

Updated on: May 19, 2025 | 4:36 PM

Share

ఎవరికైనా ఒకొక్క సారి కుడి కన్ను అదురుతుంది.. ఒకొక్కసారి ఎడమ కన్ను అదురుతుంది. ఇలాంటి సమయంలో ఏమి జరుగనుంది అనే భయం కలుగుతుంది కొందరిలో. ఇలా జరగడం ఏదైనా ప్రత్యేక సంకేతాలు కనిపిస్తున్నాయా? అని ఆలోచిస్తారు కూడా.. అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి కన్ను అదిరితే దాని అర్థం ఏమిటి? భవిష్యత్తులో మీకు ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది? స్త్రీ, పురుషుల్లో కుడి కన్ను అదరడం వెనుక ఉన్న అర్థం ఏమిటి? తెలుసుకుందాం..

శరీర భాగాలు అదరడం అనేది సర్వసాధారణంగా రోజువారీ సంఘటన. కొన్నిసార్లు శరీరంలోని ఒక భాగం వణుకుతుంది, కొన్నిసార్లు మరొక భాగం వణుకుతుంది. అయితే కుడి కన్ను అదురుతుంటే.. అది కేవలం యాదృచ్చికం కాదు.. అది భవిష్యత్తులో జరగనున్న సంఘటనలను సూచిస్తుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులు, స్త్రీలలో కుడి కన్ను అదరడం అంటే వేర్వేరు అర్థాలను కలిగి ఉంది. దీనితో పాటు కుడి కన్ను ఆదరం కూడా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీకు తెలియజేస్తుంది.

స్త్రీలలో కుడి కన్ను అదురుతుంటే దేనికి సంకేతం అంటే

సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ స్త్రీకి అయినా కుడి కన్ను అదిరితే దానిని అశుభంగా భావిస్తారు. దీనికి అర్థం వారు రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అంతేకాదు ఎవరితోనైనా గొడవ పడవచ్చు లేదా కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. కనుక స్త్రీలకు కుడి కన్ను అదిరితే దీనిని ఒక హెచ్చరికగా భావిస్తారు. కుడి కన్ను అదిరితే.. తరచుగా కలగనున్న ఇబ్బందులకు సంకేతంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

దీనివల్ల ఇంట్లో లేదా ఆఫీసులో తగాదాలు వస్తాయని నమ్ముతారు. ఇది మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా కావచ్చు. చేస్తున్న పని నిలిచిపోవచ్చు లేదా అసంపూర్ణంగా ఉండవచ్చు. ఇది సవాళ్లు లేదా ఇబ్బందులకు సంకేతంగా పరిగణించబడుతుంది. లేదా మీపై చెడు దృష్టి పడి ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. అనుకోని విధంగా కొన్ని సంఘటనలు కూడా సంభవించవచ్చు.

పురుషులలో కుడి కన్ను అదరడం

పురుషులలో కుడి కన్ను అదరడం చాలా మంచిదని భావిస్తారు. పురుషులలో ఎడమ కన్ను అదరడం అశుభంగా భావిస్తారు. పురుషులు ఏదైనా శుభకార్యం చేయబోతుంటే.. వారి కుడి కన్ను అదరడం ప్రారంభిస్తే.. ఆ పని ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా పూర్తవుతుందని అర్థం చేసుకోవాలట. పురుషులలో కుడి కన్ను అదరడం ఆర్థిక లాభానికి సంకేతంగా పరిగణించబడుతుంది.

ఎవరికైనా కుడి కన్ను అదరితే పాత పెండింగ్ పని పూర్తవుతుంది. ఉద్యోగం శాశ్వతం కావచ్చు. సామాజిక లేదా ప్రభుత్వ గుర్తింపు లభించవచ్చు. కుడి కన్ను అదరుతుంటే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారని అర్థం చేసుకోవాలట. అంతేకాదు ఆఫీసులో ప్రమోషన్ లేదా ఏదైనా అవార్డు పొందే అవకాశం కూడా ఉంది.

కుడి కన్ను అదరే సమయంలో కనిపించే లక్షణాలు

ఉద్యోగం, డబ్బు, కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో మీరు శుభవార్త పొందవచ్చు. పదోన్నతి, ఆకస్మిక ఆర్థిక లాభం లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆనందం మీ తలుపు తట్టవచ్చు, వివాహం లేదా పిల్లల వలన ఆనందం రావచ్చు. పెద్ద లావాదేవీలో విజయం లేదా వ్యాపారంలో వృద్ధి కూడా సాధ్యమే. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు, కుటుంబ జీవితంలో కూడా ఆనందం వస్తుంది. వివాహం కుదిరినట్లు లేదా పిల్లల పుట్టుక వంటి శుభవార్తలు అందవచ్చు. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఈ సమయం కొత్త పనిని ప్రారంభించడానికి లేదా పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

ఈ ప్రత్యేక చర్యలు తీసుకోండి

పురుషులకు ఎడమ కన్ను అదురు తుంటే ముందుగా ఇంటి పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించాలి. ఖీర్ తయారు చేసి లక్ష్మీ దేవికి నైవేద్యం పెట్టండి. గణేశుడికి తమలపాకు సమర్పించండి. తులసి దళాలను విష్ణువుకు సమర్పించి, తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. పేదవారికి సహాయం చేయండి. అమ్మాయికి స్వీట్లు ఇవ్వండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు