Shani Jayanti: జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం కోసం శని జయంతి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి..
పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. ఎవరి జాతకంలోనైనా శని ధైయ్యం( శని గ్రహం ప్రభావం), ఏలి నాటి శని జరుగుతుంటే శని జయంతి రోజున కొన్ని సాధారణ నివారణ చర్యలు చేయడం ద్వారా శనిశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అవి శని దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

హిందూ మతంలో శనీశ్వర్వుడి న్యాయ దేవుడిగా.. కర్మ ఫలితాలను ఇచ్చేవాడిగా పూజిస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం శనీశ్వర్వుడి జన్మ దినోత్సవాన్ని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. శనీశ్వర్వుడి ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడని చెబుతారు. శని గ్రహం ప్రభావంలో ఉన్న వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా శనీశ్వర్వుడి దోషాన్ని వదిలించుకోవాలనుకుంటే.. శని జయంతి ఉత్తమ రోజు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఏలి నాటి శని, ధైయా నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు.
2025 శని జయంతి ఎప్పుడు?
వేద క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మే 27న ఉదయం 8:31 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శని జన్మదినోత్సవాన్ని మే 27న జరుపుకుంటారు.
శని దేవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే
శని జయంతి రోజున శని చాలీసాతో పాటు హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్ పఠించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఒక పాత్రలో ఆవ నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని దానిలో మీ ప్రతిబింబాన్ని చూడండి. తరువాత ఆ నూనెను దానం చేయండి. ఇలా చేయడం వల్ల శని గ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
శని జయంతి రోజున శని దేవుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున, నల్ల నువ్వులు, నల్ల మినపప్పు, నూనె , బూట్లు-చెప్పులు మొదలైనవి పేదలకు, అవసరం ఉన్నవారికి దానం చేయాలి.
శని జయంతి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
శనీశ్వర్వుడిని కర్మ ఫలాలను ఇచ్చేవాడు అని అంటారు. ఎవరైనా సరే కొన్ని తప్పులు చేస్తే శనీశ్వర్వుడు వారిపై కోపంగా ఉంటాడని అంటారు. వృద్ధులను, మహిళలను అవమానించేవారిని, ఇతరులను మోసం చేసేవారిని లేదా మూగవారిని వేధించేవారి పట్ల శని దేవుడి చాలా ఆగ్రహంగా ఉంటాడని.. ఆయన ఆశీస్సులు ఎప్పటికీ లభించవని చెబుతారు.
ఏ మంత్రాలను జపించాలంటే
శని బీజ మంత్రం – ఓం ప్రమ్ ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః
శని గాయత్రీ మంత్రం – ఓం కాకద్వజాయ విద్వహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మండ ప్రచోదయాత్
శని మూల మంత్రం- ఓం శం శనైశ్చరాయ నమః
శని మహా మంత్రం- నిలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








