AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Cure Temple: ఈ ఆలయం నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ.. షుగర్ వ్యాధి నయం చేసే చీమలు.. దేశ విదేశాల నుంచి భక్తుల క్యూ

మన దేశంలో గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా అడుగడుగునా గుడి ఉంది. హిందువులు దైవాన్ని నమ్ముతారు. తమ కోరికలు నెరవేర్చుకునేందుకు దేవాలయాలను వెళ్లి దేవుడిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకుంటారు. ఈ దేవాలయాలు మన సంస్కృతికి, చరిత్రకు ఒక నిదర్శనం. కొన్ని ఆలయాలు నేటికీ సైన్స్ చేధించని రహస్యాలకు నెలవు. అటువంటి ఓ ఆలయం తమిళనాడులో ఉంది. ఇక్కడ షుగర్ నయం చేస్తుంది నమ్మకం. మొత్తం దేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం ఇదే.

Diabetes Cure Temple: ఈ ఆలయం నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ.. షుగర్ వ్యాధి నయం చేసే చీమలు.. దేశ విదేశాల నుంచి భక్తుల క్యూ
Karumbeswarar Temple
Surya Kala
|

Updated on: May 16, 2025 | 10:58 AM

Share

గత కొన్నేళ్లుగా ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి . జీవనశైలి, ఆహారంలో మార్పులు ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. ఇంకా ఈ వ్యాధి ఒకసారి వస్తే.. ఈ వ్యాధికి చికిత్స లేదు..నివారణ మార్గం అని తెలిసిందే. అయితే దేశంలోని ఈ ఆలయంలో దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే.. ఇక్కడ డయాబెటిస్ క్షణంలో మాయమవుతుంది. అవును. ఇది చాలా వింతగా అనిపించవచ్చు. ఈ మహామహిత్వ ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరానికి 26 కి.మీ. దూరంలో ఉంది. ఈ అద్భుతమైన సంఘటన అమ్మాపెట్టి లేదా అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉన్న వెన్ని కరుంబేశ్వర్ ఆలయం (తమిళనాడులోని కరుంబేశ్వర ఆలయం) లో ప్రతిరోజూ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు తమ మధుమేహం నుంచి స్వస్థత పొందారు. మరి ఈ ఆలయంలో మధుమేహం ఎలా నయమవుతుంది? ఈ గుడిలో చీమలు వైద్యం ద్వారా నయం చేయలేని వ్యాధులను ఎలా నయం చేస్తాయో తెలుసుకుందాం..

ఆ అద్భుతాన్ని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు!

భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో 5000 సంవత్సరాల పురాతనమైన శివలింగం ఉంది. దీనిని శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంత శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందారు. నయమయ్యారు. ఇక్కడ జరిగే అద్భుతం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు స్వయంగా ఇక్కడ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరు పరీక్షలు నిర్వహించి కోలుకున్న భక్తుల గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇది నిజమని నిరూపించారు.

మధుమేహం ఎలా నయమవుతుంది?

మధుమేహం నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులు అర కిలో సుజీ రవ్వ, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని.. ఈ రెండిటిని కలిపి తీసుకెళ్లాలి. ఆలయంలో పూజ చేసిన తర్వాత.. ఈ రవ్వ చెక్కర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి. అక్కడ.. చీమలు వచ్చి రవ్వను వేరు చేసి, చక్కెరను మాత్రమే తింటాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది వస్తారు. ఇది కొంచెం వింతగా అనిపించినా.. మీరు నమ్మాల్సిందే. ఇలాంటి చీమలు చక్కెర తినడానికి వచ్చినప్పుడు.. ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి.. చీమలు చక్కెరను తినడంతో చక్కెర ఉన్నవారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోయాయని చూసి ఆశ్చర్యపోయారు. అంతే కాదు ఈ అద్భుతం నిజంగా జరుగుతుందని .. షుగర్ తగ్గడం నిజమేనని వైద్యులు అంగీకరించారు. ఈ ఆలయంలోని చీమలను దేవుని చీమలు అని పిలుస్తారు. మొఘల్ రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.