Viral Video: పురుషులకు పట్టపగలే నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయో తెలుసా.. పురోహితుడి అన్సార్ రాక్.. ఆహుతులు షాక్
పెళ్లి వేడుకలో పురోహితుడు వరుడి భవిష్యత్తు గురించి చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన చెప్పిన విషయం నవ దంపతులను మాత్రమే కాదు ఆహుతులను కూడా బాగా నవ్వించింది. ఇప్పుడు ఈ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీనిలో పురోహితుడు వరుడికి వివాహం తర్వాత అబ్బాయిల జీవితం ఎలా ఉంటుందో చెప్పాడు. ఇది విన్న తర్వాత అక్కడ ఉన్న వధువు బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది.

సోషల్ మీడియా ప్రపంచంలో వివాహానికి సంబంధించిన రకరకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇది పెళ్లిళ్ల సీజన్ అవునా కాదా అనేది నెటిజన్లకు పట్టింపు లేదు. వివాహానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూనే ఉంటారు. అవి ప్రజలకు చేరువైన వెంటనే వైరల్ అవుతాయి. ప్రస్తుతం ఒక వివాహానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసిన తర్వాత మీరు మీ నవ్వును నియంత్రించుకోలేరు. ఎందుకంటే ఇక్కడ పురోహితుడు రానున్న సునామీ గురించి వరుడిని హెచ్చరిస్తున్నాడు.
హిందూ సంప్రదాయంలో పెళ్లి వేడుకలో పురోహితుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందుకే వధూవరుల తర్వాత.. వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది పండితుడీకే. ఇద్దరు వ్యక్తులను వేద మంత్రాల సాక్షిగా ఒకే దారంలో ముడిపడేలా చేసేది పురోహితుడే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వివాహ వేడుకకు రెడీ అవుతున్న పురోహితుడు.. హవనాన్ని రెడీ చేస్తూ వివాహ మంత్రాలు పఠించే ముందు వరుడికి ఒక సలహా ఇచ్చాడు. ఇది విన్న తర్వాత అక్కడ ఉన్న బంధువులందరూ బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు.
వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
వధూవరులు పెళ్లి మండపంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వధూవరుల తల్లిదండ్రులు కూడా ఒకవైపు కూర్చుని ఉండటం వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో పండితుడు వరుడిని నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయని అడుగుతున్నాడు. వరుడు రాత్రి సమయంలో కనిపిస్తాయని చెప్పాడు. దీని తరువాత పండితుడు మాట్లాడుతూ..వివాహం జరిగిన తర్వాత.. ఈ నక్షత్రాలు పగటి సమయంలో కూడా నక్షత్రాలు కనిపిస్తాయని చెప్పాడు. ఇది విన్న తర్వాత అక్కడ కూర్చున్న వధువు కూడా బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది.
ఈ వీడియో twinkle_pasricha అనే ఖాతా నుంచి Instaలో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ తమ ప్రతిచర్యలను ఇస్తున్నారు. ఒక యూజర్ ‘సోదరా ఇంకా సమయం ఉంది.. పండితులు చెప్పేది వినండి’ అని కామెంట్ చేయగా మరొకరు పండితులు తన జీవితానుభవాన్ని ఇక్కడ చెబుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మరొకరు అవును పురోహితులు చెప్పింది పూర్తిగా నిజమే.. ఈ నక్షత్రాలు అబ్బాయిలకు మాత్రమే కనిపిస్తాయని రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




