AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma Temple: బ్రహ్మదేవుడికీ ఓ ఆలయం.. ఇక్కడ గర్భ గుడిలోకి పురుషులకు నో ఎంట్రీ.. ఎందుకంటే

రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉన్న విశ్వ సృష్టికర్త బ్రహ్మ దేవుడి ఆలయం ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ ఆలయం. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. దీని నిర్మాణ శైలితో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పుష్కర్ సరస్సు, ప్రసిద్ధ పుష్కర్ ఉత్సవం ఈ ప్రదేశం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం కూడా ఉంది.

Brahma Temple: బ్రహ్మదేవుడికీ ఓ ఆలయం.. ఇక్కడ గర్భ గుడిలోకి పురుషులకు నో ఎంట్రీ.. ఎందుకంటే
Pushkar Brahma Temple
Surya Kala
|

Updated on: May 16, 2025 | 8:08 AM

Share

ఆరావళి పర్వత శ్రేణి ఒడిలో ఉన్న ప్రశాంతమైన, ఆధ్యాత్మిక నగరం పుష్కర్. దీని ప్రత్యేక గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని ఉన్న అతి తక్కువ ఆలయాల్లో ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఆలయం ఇక్కడ ఉండటమే కారణం. అంతేకాదు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పుష్కర్ కుంభమేళా ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఈ ఆలయం భక్తులకు విశ్వాస కేంద్రంగా మాత్రమే కాదు నిర్మాణ శైలి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు సజీవ ఉదాహరణగా కూడా ఉంది. ఈ అద్భుతమైన ప్రదేశం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

విశ్వ సృష్టికర్త బ్రహ్మ దేవుడి ఆలయం

పుష్కర్ లో అతిపెద్ద ఆకర్షణ నిస్సందేహంగా బ్రహ్మ దేవుడి ఆలయం. ఈ ఆలయం అత్యంత ప్రాచీన ఆలయం. బ్రహ్మ దేవుడిని పూజించే ఆలయం చాలా ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు యజ్ఞం చేసాడు. దీని కారణంగా ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎరుపు రంగు శిఖరం, పాలరాయితో నిర్మించబడిన ఈ ఆలయం దీని నిర్మాణ శైలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఆలయ గర్భగుడిలో చతుర్ముఖుడైన బ్రహ్మ దేవుడి అందమైన విగ్రహం ప్రతిష్టించబడింది. భక్తులు ఆయనను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ ఆలయ సముదాయంలో ఇతర దేవుళ్ళు, దేవతల చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఈ ప్రదేశం పవిత్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. పుష్కర్ సరస్సులో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు వస్తారు.

ఇవి కూడా చదవండి

బ్రహ్మ ఆలయ ప్రాముఖ్యత

పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం హిందూ మతంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునర్నిర్మించారు. బ్రహ్మ దేవుడు పుష్కర్ సరస్సు ఒడ్డున యజ్ఞం చేశాడని.. అలా యజ్ఞం చేసే సమయంలో సరస్వతి దేవి లేకపోవడంతో గాయత్రి దేవి’ని వివాహం చేసుకున్నాడని చెబుతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సరస్వతి దేవి.. తన భర్త చేసిన పనికి కోపగించి బ్రహ్మ దేవుడికి శాపం ఇచ్చిందట. అంతేకాదు ఈ ఆలయంలోకి వివాహిత పురుషుడు వెళ్ళకూడదు. వెళ్ళితే దంపతుల మధ్య వివాదాలు నెలకొంటాయని నమ్మకం. అందువల్ల ఈ ఆలయాన్ని ప్రాంగణం నుంచి మాత్రమే పురుషులు దర్శించుకుంటారు. వివాహిత స్త్రీలు లోపలికి వెళ్లి పూజించవచ్చు. ఇక్కడ సరస్వతి దేవి ఆలయంలో విగ్రహం కోపంగా ఉన్నట్లు కనిపిస్తే.. గాయత్రీ దేవి సరస్వతి దూరంగా ఉన్న ఆలయం ఉంది.

ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుష్కర్ కుంభమేళా

పుష్కర్ బ్రహ్మ ఆలయానికి మాత్రమే కాదు ఇక్కడ పుష్కర్ కుంభమేళా అని కూడా పిలువబడే భారీ ఒంటెల ఉత్సవానికి కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసంలో నిర్వహించబడే ఈ ఉత్సవంలో వేలాది ఒంటెలు, గుర్రాలు, ఇతర జంతువుల వ్యాపారం జరుగుతుంది. ఈ ఉత్సవం రాజస్థానీ సంస్కృతిని ప్రదర్శిస్తుంది. దీనిలో జానపద సంగీతం, నృత్యం, సాంప్రదాయ కళల అద్భుతమైన సంగమం కనిపిస్తుంది. పుష్కర్ కార్తీక మేళా అనేది ఒక పెద్ద ఆధ్యాత్మికం, సాంస్కృతిక కార్యక్రమం. అందుకనే దీనిని కుంభమేళాలతో పోల్చారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు పుష్కర్ సరస్సు ఒడ్డున పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు