AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Saturn conjunction: సూర్యునిపై శని వక్ర దృష్టి.. ఈ రాశులవారు బంగారం పట్టుకున్న మన్నే.. జాగ్రత్త సుమా..

నవ గ్రహాలకి అధినేత సూర్యుడు తన రాశిని మార్చుకుని వృషభరాశిలోకి అడుగు పెట్టాడు. శనీశ్వరుడు ఇప్పటికే మీనరాశిలో ఉన్నాడు. దీంతో సూర్యుడు, శనీశ్వరుడి కలయిక ఏర్పడింది. అదే సమయంలో శనీశ్వరుడి, సూర్యునిపై తన దృష్టిని కేంద్రీకరించబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులకు సంబంధించిన వ్యక్తులకు సమస్యగా మారవచ్చు. కనుక ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

Sun Saturn conjunction: సూర్యునిపై శని వక్ర దృష్టి.. ఈ రాశులవారు బంగారం పట్టుకున్న మన్నే.. జాగ్రత్త సుమా..
Sun And Shani Conjunction
Surya Kala
|

Updated on: May 16, 2025 | 9:06 AM

Share

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు, శనీశ్వరుడి మధ్య సంబంధం తండ్రి తనయుడు అయినా ఒక సంక్లిష్టమైన అంశం. అయితే రెండూ చాలా ప్రభావవంతమైనవి. రాశి లేదా జాతకంలో ఈ గ్రహాల ప్రభావం వ్యక్తి జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు, శనీశ్వరుడి ఒకరినొకరు చూడటం చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది.

సూర్యుడు, శనీశ్వరుడు తండ్రీ కొడుకులు అయినప్పటికీ.. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఇద్దరూ ఒకరికొకరు బద్ధ శత్రువులు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు, శనీశ్వరులను ఒకరికొకరు శత్రు గ్రహాలుగా పేర్కొన్నారు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని సాత్వికుడిగా, శుభంగా, కాంతి కారకంగా పరిగణిస్తారు, అయితే శనీశ్వరుడిని తామసిక, కఠినమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇది జీవితంలో పోరాటాన్ని, చీకటిని సృష్టిస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితిలో వీరిద్దరూ కలిసి ఉండటం లేదా ఒకరినొకరు చూసుకోవడం జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో మంచిది కాదు.

సూర్యునిపై శని గ్రహం వక్ర దృష్టి

మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో శనీశ్వరుడు తన చెడు దృష్టిని సూర్యునిపై ప్రయోగిస్తాడు. దీని ప్రభావం వలన అనేక రాశులకు విపత్తుగా మారవచ్చు. సూర్యుడు, శనీశ్వరుడి కలిసి కొన్ని రాశులపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఒక్క పొరపాటు కూడా ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. కనుక ఈ రోజు 30 రోజులు జాగ్రత్తగా ఉండండి.

ఇవి కూడా చదవండి

30 రోజులు బాధాకరంగా ఉంటాయి శనీశ్వరుడి చెడు దృష్టి సూర్యునిపై ఉండటం 5 రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. శనీశ్వరుడి ప్రభావాలను నివారించడానికి ఈ వ్యక్తులు ఈ 30 రోజులు జాగ్రత్తగా ముందుకు సాగాలి.

వృషభ రాశి: సూర్యుడు, శనీశ్వరుడు ఇద్దరూ తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కనుక ముందుగా వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించాడు. ఈ కలయిక ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వం పదునుగా మారుతుంది. అధిక కోపం కుటుంబ, సంబంధాలలో ఇబ్బంది కలిగిస్తుంది. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

తులా రాశి: తుల రాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యుడు, శనీశ్వరుడి ప్రభావం వల్ల వీరు కఠిన పరిస్థితులను అనుభవిస్తారు. నొప్పి , నిరాశలు ఉంటాయి. ఈ నెల రోజుల పాటు ఓపికగా ఉండండి. అనవసరంగా ఆగ్రహం, తొందర పాటు చర్యల వలన సమాజంలో మీ స్థానం మరింత దిగజారిపోతుంది.

మిథున రాశి: అయితే మిథున రాశి వారిపై సూర్యుడు, శనీశ్వరుడి కఠినంగా ఉంటారు. కనుక ఎక్కువ పని ఉంటుంది. ఫలితాలు మంచివి కావు. ప్రజలపై ఆధారపడకుండా.. మీరే పని చేసుకుంటూ ఉండండి. పనిలో నిర్లక్ష్యంగా ఉండకండి.

మకర రాశి: ఈ సమయంలో మకర రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తాడు. రెచ్చగొడతాడు. మీలో కోపాన్ని పెంచుతాడు. అయితే వీరు సంయమనం పాటించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకుంటే మీకు నష్టం మాత్రమే కలిగిస్తుంది.,

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వ్యక్తుల సంబంధాలలో చేదు ఉండవచ్చు. ప్రియమైనవారి నుంచి విడిపోవచ్చు. అయితే కోపానికి వీలైంత నిగ్రహించుకొండి. ఎవరితోనూ ఎక్కువగా వాదించకండి. ఈ రోజుల్లో పొరపాటున కూడా ఎటువంటి ఆర్థిక నిర్ణయం తీసుకోకండి. లేకుంటే అందుకు తగిన పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!