AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాక్‌లో ఏ జిల్లాలో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్నారో తెలుసా.. అక్కడ ఉన్న దేవాలయంలో నిత్యాన్నదానం

అఖండ భారత దేశం మత ప్రాతిపదికిన భారత్, పాకిస్తాన్ అనే దేశాలుగా విభజింప బడ్డాయి. అయితే అప్పటి వరకూ పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు కొంతమంది భారత దేశానికి తరలి వచ్చారు. కొంత మంది మాత్రం ఆ దేశంలోనే ఉండిపోయారు. అయితే అక్కడ పరిస్థితుల్లో మార్పులతో మైనరీలైన హిందువుల జనాభా భారీ సంఖ్యలో తగ్గిపోయారు. అయినా సింధ్ ప్రావిన్స్‌లో ఇప్పటికీ భారీ సంఖ్యలో హిందువులు నివసిస్తున్నారు. ఉమర్‌కోట్, తార్పార్కర్ వంటి జిల్లాలు హిందువులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు. విభజన తర్వాత అనేక దేవాలయాలు ధ్వంసమైనా కొన్ని దేవాలయాలు నేటికీ పురాతన హిందూ సంప్రదాయానికి చిహ్నంగా ఉన్నాయి.

Pakistan: పాక్‌లో ఏ జిల్లాలో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్నారో తెలుసా.. అక్కడ ఉన్న దేవాలయంలో నిత్యాన్నదానం
Hindu Minority Pakistan
Surya Kala
|

Updated on: May 16, 2025 | 9:30 AM

Share

పాకిస్తాన్ ముస్లింలు అధికంగా ఉన్న దేశం అయిననా హిందువులు భారీ సంఖ్యలో నివసించే ప్రదేశం ఒకటి ఉంది. ఈ ప్రదేశం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉంది. ఇక్కడ ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా నివసిస్తున్నారు. విభజనకు ముందు ముస్లింలతో పాటు చాలా మంది హిందువులు కూడా పాకిస్తాన్‌లో నివసించారు. ఈ కారణంగా అక్కడ హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అయితే కాలక్రమేణా ఆ ఆలయాలు నాశనమయ్యాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

పాకిస్తాన్‌లో ఎక్కువ మంది హిందువులు ఎక్కడ నివసిస్తున్నారంటే

ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లో మొత్తం హిందువుల సంఖ్య దాదాపు 39 లక్షలు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ అత్యధిక హిందూ జనాభాను కలిగి ఉంది. అక్కడ దాదాపు నూటికి 93 మంది హిందువులు నివసిస్తున్నారు. సింధ్‌లోని ఉమర్‌కోట్, తార్పార్కర్, మిర్‌పుర్ఖాస్ , సంఘర్ జిల్లాలను హిందూ మెజారిటీ ప్రాంతాలు (పాకిస్తాన్‌లోని హిందూ ప్రదేశ్) అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ దేవాలయాలు:

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని థార్పార్కర్ జిల్లాలోని ఇస్లాంకోట్ నగరంలో ఒక సాధువు ఆశ్రమం ఉంది. ఇది పాకిస్తాన్ హిందూ సమాజంలో అత్యంత పూజ్యనీయులైన దేవాలయాలలో ఒకటి. ఇది జిల్లా రాజధాని మిథి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆశ్రమం దేవాలయాలు, విశ్రాంతి స్థలాలతో సహా 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిని హిందూ సాధువు నేను రామ్ నిర్మించాడని చెబుతారు. ఇక్కడ రోజువారీ ప్రార్థనలతో పాటు, అవసరమైన వారికి ఆహారం కూడా అందించబడుతుంది. సంత్ నేనురామ్ ఆశ్రమంలో ఒక వంటగదిని నిర్మించారు. అక్కడ కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ ఆహారం వడ్డించేవారు.

ఆశ్రమానికి వచ్చే ప్రజలకు ఆహారం ఏర్పాటు చేయడానికి వారు ఇంటింటికీ వెళ్లి ఆహార ధాన్యాలు సేకరించేవారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. నేటికీ, ఆశ్రమానికి వచ్చే చాలా మంది భక్తులు వంట చేయడానికి తమతో పాటు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్