AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: జీవితంలో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సాగిపోవాలా.. రాత్రి పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

రాత్రి సమయంలో మనం చేసే కొన్ని పనులు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు రాత్రి సమయంలో చేయకూడదు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం , ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక మనం వాస్తు నియమాలను పాటిస్తూ రాత్రి సమయంలో చేయకూడని పనులకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు రాత్రి సమయంలో చేరకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

Vastu Tips: జీవితంలో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సాగిపోవాలా.. రాత్రి పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..
Vastu Tips For Happy Life
Surya Kala
|

Updated on: May 17, 2025 | 10:51 AM

Share

హిందూ మతంలోని వాస్తు శాస్త్రం ప్రకారం ప్రజలు రాత్రి సమయంలో ఏ పని చేయకూడదు. మనం కొన్ని రకాల పనులు చేస్తే చెడు పరిణామాలను అనుభవించాల్సి వస్తుందని నమ్ముతారు. కనుక రాత్రి సమయంలో మనం చేయకూడని పనులకు దూరంగా ఉండటం మంచిది. అయితే కొంతమంది వాస్తు నియమలాను చాదస్తం అంటూ కొట్టివేస్తారు. దీంతో జీవితంలో చాలా సమస్యలను సృష్టిస్తుంది. మన జీవితం చాలా వరకు వాస్తు శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ చేసే ఇంటి నిర్మాణం, దిశలు, వాతావరణం , మనం చేసే అన్ని పనులు శుభప్రదంగా ఉంటాయి. ఈ శాస్త్రం ద్వారా సమస్యలను నివారించుకోవచ్చు. అయితే రాత్రి సమయంలో చేయకూడని పనుల గురించి వాస్తు శాస్త్రం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఈ సమయంలో చేసే పని చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ విషయాలు మనకు చెడు పరిణామాలను తెస్తాయి. అవి ఏమిటంటే..

సూర్యాస్తమయం తర్వాత ఇల్లుని శుభ్రం చేయవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం అశుభంగా పరిగణించబడుతుంది. చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. సాయంత్రం ఇంటిని ఊడ్చడం ద్వారా లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుందని నమ్మకం. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు పడతారని.. డబ్బు నష్టం జరుగుతుందని నమ్మకం. కనుక ఇంటిని సాయంత్రం దీపం పెట్టే లోపు శుభ్రపరచాలి.

రాత్రి గోర్లు, జుట్టు కత్తిరించవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి గోర్లు, జుట్టు కత్తిరించడం మంచిది కాదు. దీనివల్ల పేదరికం పెరుగుతుంది. సమయంతో పని లేకుండా ఎప్పుడు బడితే అప్పుడు గోళ్లు కత్తిరించుకునే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అంతేకాదు ఈ అలవాటు ఉన్నవారు మానసికంగా , ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక రాత్రి సమయంలో గోర్లు, జుట్టు కత్తిరించడం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

రాత్రి ఆలస్యంగా తినవద్దు: మారిన జీవన శైలిలో భాగంగా ఆహరం తినే సమయాల్లో కూడా మార్పులు వచ్చాయి. దీంతో చాలా మంది ఇప్పుడు రాత్రి తినే విషయంలో సమయం పాటించడం లేదు. అయితే ఇలా రాత్రి ఆలస్యంగా తినడం అసలు మంచిది కాదు. శాస్త్రాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు శారీరక శక్తిని నిర్వీర్యం చేస్తుంది. అంతేకాదు రాత్రి ఆలస్యంగా ఆహారం తిని వెంటనే నిద్ర పోతారు. దీంతో రాత్రి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కనుక రాత్రి ఆహారం తినే తినడం సమయాన్ని పాటించాలి. వీలైనంత వరకూ సాయంత్రం 7. కే తినెయ్యడం అన్ని విధాల మంచిది.

ఏ దిశల్లో మీ తల పెట్టుకోవద్దు అంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి నిద్రించే సమయంలో పొరపాటున కూడా మీ తలను ఉత్తర దిశలో ఉంచకూడదు. ఈ తప్పు తెలిసి చేసినా తెలియకుండా చేసినా.. అది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఈ ఉత్తర దిశలో దేవత నివాసం కాదు. కనుక ఈ దిశలో తల పెట్టి నిద్రపోతే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని నమ్మకం. అంతేకాదు ఈ దిశలో తల పెట్టి నిద్రపోయే వ్యక్తికి శక్తి తగ్గుతుంది.

కనుక వాస్తు శాస్త్రంలో చెప్పిన ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. కుటుంబంలో శాంతి, ఆనందాన్ని తెస్తాయి. అంతేకాదు ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని నివారిస్తాయి. కనుక ఈ వాస్తు చిట్కాలను అనుసరించి సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..