AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia: ఆ దేశంలో కేవలం 2% హిందువులు మాత్రమే.. నేటికీ రోజూ రామాయణం పారాయణం.. ఘనంగా దీపావళి వేడుకలు

ముస్లిం మెజారిటీ దేశంలో .. హిందూ పండగలు ఘనంగా జరుపుకుంటారు. ఆ దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు 87% మంది ముస్లిం మూలాలున్నాయి. ఈ దేశంలో కేవలం 2% మంది హిందువులు మాత్రమే ఉన్నారు. అయినా సరే అక్కడ రామ్ లీలాను, దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. రాముడు, సీత, హనుమంతుడు, శివుడు హిందూ దేవుళ్ళు కనిపిస్తారు. అంతేకాదు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడ జరిగే రామాయణ ప్రదర్శనను చూడటానికి వస్తారు. ఇప్పటికే రామాయణ ప్రదర్శనను గిన్నిస్ పుస్తకంలో నమోదు చేయబడింది. ఈ రోజు అది ఏ దేశమో తెలుసుకుందాం..

Indonesia: ఆ దేశంలో కేవలం 2% హిందువులు మాత్రమే.. నేటికీ రోజూ రామాయణం పారాయణం.. ఘనంగా దీపావళి వేడుకలు
Indonesia Celebrate Ramayana And Diwali
Surya Kala
|

Updated on: May 17, 2025 | 9:36 AM

Share

ప్రపంచంలోని దేశాల్లోని అనేక ముస్లింలు దేశాలున్నాయి. అదే విధంగా ఆ ముస్లింల దేశంకి కేవలం (2%) రెండు శాతం ముస్లిం జనాభా ఉన్నారు. అయితే అక్కడ ఇప్పటికీ రామ భక్తులు ఉన్నారు. అక్కడ రోజూ రామాయణం ప్రదర్శిస్తారు. దీపావళి పండగను కూడా జరుపుకుంటారు. ఈ రోజు ఆ దేశం ఎక్కడ ఉంది? సంస్కృతి వారసత్వం సంపదగా హిందూ రామాయాణం ఎలా మారింది తెలుసుకుందాం..

ఈ దేశం ఇండోనేషియా. ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశం. అయినప్పటికీ.. ఇక్కడ కొంతమంది ప్రజలు హిందూ మతాన్ని అనుసరిస్తారు. దాదాపు 87 శాతం ముస్లిం జనాభా ఉన్న ఈ దేశంలో రామాయణ బ్యాలెట్ ప్రదర్శనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నేటికీ ఇక్కడ హిందూ వేల ఆలయాలు ఉన్నాయి.

రామాయణం ఇక్కడ ఒక సాంస్కృతిక వారసత్వం.

ఇవి కూడా చదవండి

ఆ దేశం ఇండోనేషియా. ఇది ముస్లిం దేశం. అయినప్పటికీ ఇక్కడ ప్రతిరోజూ రామాయణం బాలెట్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇండోనేషియాలో.. రామ్ లీలా సాంస్కృతిక వారసత్వంగా కనిపిస్తుంది. ఇక్కడ దీపావళి పండగను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో.. రామ్ లీలా కార్యక్రమాన్ని ఎంత వైభవంగా జరుపుకుంటారంటే.. వీధుల్లో జరుపుకునే పండుగను చూడటానికి ఒక అందమైన దృశ్యంగా ఉంటుంది.

ముస్లిం కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు.

ఇక్కడి ముస్లిం కళాకారులు రాముడు, సీత, హనుమంతుడి పాత్రలకు ప్రాణం పోస్తారు. ఈ దేశం మొత్తం రామలీల జరుపుకుంటుంది. దీపావళి కూడా ఇక్కడ జరుపుకుంటారు. దీపావళి సమయంలో ఇక్కడ జరిగే ఆడంబరం మరియు ప్రదర్శన చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

రామాయణం చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు

ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని ప్రంబనన్ హిందూ ఆలయ సముదాయం రామాయణ చిత్రణలకు ప్రసిద్ధి చెందింది. రామాయణం చూడటానికి భారతీయులు లేదా స్థానికులు మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇండోనేషియా నుంచి వచ్చిన కళాకారులు, ముస్లింలు రామ-సీత పాత్రలను, రామాయణంలోని వివిధ పాత్రలను అద్భుతంగా ప్రదర్శిస్తారు. రామాయణాన్ని శ్రీ వాల్మీకి మహర్షి రచించినప్పటికీ.. రామాయణంకి చెందిన 300 కంటే ఎక్కువ వెర్షన్లు ఉన్నాయి. నగరంలో జరిగే రామాయణ ప్రదర్శనను రామకీన్ అంటారు. రామకీన్ అనేది పూర్తిగా రామాయణం ఆధారంగా రూపొందించబడిన ఒక రకమైన నృత్య నాటకం. అయితే ఇందులో రామాయణంలోని పాత్రల పేర్లు కొద్దిగా మార్చబడ్డాయి.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు

ఇక్కడి ఆలయ థియేటర్‌లో ప్రతిరోజూ రామాయణం ప్రదర్శించబడుతుంది. రామాయణ నృత్య నాటకం.. అంటే రామాయణ బ్యాలెట్ 1971 లో ఇక్కడ ప్రారంభించబడింది. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. దీని పేరు ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం నడిచిన నృత్య నాటకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది.

నేటికీ ఇక్కడ వేల ఆలయాలు ఉన్నాయి.

బాలి, పశ్చిమ పాపువా, సులవేసి, సుమత్రాలలో దీపావళి పండగను గొప్పగా జరుపుకుంటారు. అదేవిధంగా ఇండోనేషియాలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ప్రాంతంలో ఒక హిందూ దేవాలయం ఉంది. ఇండోనేషియాలోని దేవాలయాలు దక్షిణ భారతదేశంలోని దేవాలయాల తరహాలో నిర్మించబడ్డాయి. ఇక్కడ దాదాపు ఒకటిన్నర వేల ఆలయాలు ఉన్నాయని చెబుతారు. ఈ దేశంలోని అనేక ప్రాంతాల్లో రామాయణం సంగ్రహావలోకనం కనిపిస్తుంది. ప్రతిచోటా హిందూ మతంలోని ముఖ్యమైన సీతా రాములు కనిపిస్తారు. అది రాతి శిల్పాలలో అయినా లేదా రామాయణంలో అయినా.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు