Samatha Kumbh 2023: ఘనంగా సమతా కుంభ్‌ బహ్మోత్సవాలు.. సాయంత్రం శాంతి కళ్యాణం.. 16 రకాల దానాలు

సమతా కుంభ్‌-2023 బహ్మోత్సవాల్లో భాగంగా సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి, సర్వనామ సంకీర్తికి, 108 రూపాలలో చారిత్రాత్మక, అపూర్వ, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం.. సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాన వేదికపై జరుగుతుంది.

Samatha Kumbh 2023: ఘనంగా సమతా కుంభ్‌ బహ్మోత్సవాలు.. సాయంత్రం శాంతి కళ్యాణం.. 16 రకాల దానాలు
Samantha Kumbh 2023
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2023 | 12:33 PM

శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిత్య కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5:45 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో అష్టాక్షరీ మంత్రజపం జరిగింది. భక్తులంతా అరగంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆరాధన, సేవాకాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థ, ప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా చినజీయర్‌ స్వామివారు తీర్థం అనుగ్రహించారు. నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమతా కుంభ్‌-2023 బహ్మోత్సవాల్లో భాగంగా సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి, సర్వనామ సంకీర్తికి, 108 రూపాలలో చారిత్రాత్మక, అపూర్వ, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం.. సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాన వేదికపై జరుగుతుంది.

శాంతి కళ్యాణ మహోత్సవం జరిగే విధానం కళ్యాణం అంటే మంగళం కలుగజేసేదని అర్థం, సాధారణంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో రాముడికో కృష్ణుడికో కల్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకే వేదికపై శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు ఒకేసారి శాంతి కల్యాణం జరుగుతుంది. శ్రీ చినజీయరు స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేడుక జరగనుంది. ఈ కల్యాణాన్ని వీక్షించడం మన పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే వారిద్దరూ కలిస్తేనే మనమంతా సంతోషంగా ఉంటాం. ఈ చరాచర సృష్టి నడవాలంటే వారిద్దరూ కలిస్తేనే జరుగుతుంది. లక్ష్మీ అంటే దయ, భూదేవి అంటే క్షమ ఇద్దరినీ కలుపుకొని అందరినీ రక్షించేందుకు స్వామివారు కళ్యాణం జరుపుకుంటారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల ఆ భగవంతుడు 108 రూపాల్లో మనకి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా విష్ణు యొక్క సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి, వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యాహవచనం జరిపిస్తారు.

మంత్రపూరితమైన జలంతో ప్రోక్షణ చేస్తేనే కళ్యాణానికి యోగ్యత వచ్చినట్టు. ఆ తర్వాత రక్షణ బంధన కార్యక్రమం చేసుకుని.. నాలుగు ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యం, గృహస్థ్యం, వానప్రస్థం, సన్యాసం ఆశ్రమ ధర్మాల్లో కళ్యాణం జరిగే పెరుమాళ్లు బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాన్ని గుర్తుచేసుకుని రెండోది అయిన గృహస్థ్యం ధర్మాన్ని స్వీకరించబోతున్నారు. స్వామి, అమ్మవార్లను కూర్చోబెట్టి ఇద్దరి గోత్రనామాలను ప్రవరానుసంధానం చేస్తారు. తేనె, పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పిస్తారు. దంపతులకు పట్టు వస్త్ర సమర్పణ చేస్తారు. ఇరువురు దంపతులు వారికి ఎల్లవేళలా మంగళం కలగాలని మంగళాష్టకాలను చదువుతారు. స్వామి సంపాదన మహా సంకల్పంలో చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత గో, భూ, సువర్ణలాంటి 16 దానాలు చేస్తారు. సుమూర్తం సమయంలో జీలకర్ర, బెల్లం సమర్పిస్తారు. మంగళసూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు సమర్పిస్తారు. స్వామి అనుజ్ఞ తీసుకుని అర్చకుడి ద్వారా అమ్మవారికి మంగళసూత్రాన్ని సమర్పిస్తారు. ఇద్దరికి మంగళ అక్షితలు సమర్పిస్తారు. మాలమార్పిడి జరిపించి, ఎన్నో నైవేద్యాలను స్వామివారికి నివేదిస్తారు. ఇలాంటి కళ్యాణాలను ఎన్నో జరిపించుకునేలా దీవించమని వేడుకుంటారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల మన జన్మసుకృతం అవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..