AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు..

సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala) లో రథసప్తమి (Ratha sapthami) వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి వారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు..
Basha Shek
|

Updated on: Feb 08, 2022 | 11:34 AM

Share

సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala) లో రథసప్తమి (Ratha sapthami) వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మలయప్పస్వామి వారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కాగా కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో శ్రీవారి వాహన సేవలను టీటీడీ (TTD) ఏకాంతంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కరోజు జరిగే రథసప్తమి బ్రహోత్సవాలను కూడా భక్తులు లేకుండానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా జరిగే వాహన సేవల్లో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులను కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొంటున్నారు. కాగా ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి ఉత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం పరిసరాలను ఏడు టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించింది టీటీడీ. కాగా ఈ పర్వదినం రోజున ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

సూర్య నారాయణుడి సేవలో ప్రముఖులు..

ఇక శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవస్థానంలో తెల్లవారుజామునుంచే రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సూర్యభగవానుడికి తొలి పూజను నిర్వహించారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారంతో సహా పలువురు ప్రముఖులు, అధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా అనివార్య కారణాల వల్ల విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ వేడుకలకు హాజరు కాలేదు. ఫలితంగా ఆలయ అర్చకులతోనే కైంకర్య సేవలు నిర్వహించారు.

Also Read:IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనలేకపోతున్న అండర్ 19 ఆటగాళ్లు.. ఆ ఎనిమిది మంది ఎవరంటే..

Cement prices: ఇళ్లు కట్టుకునే వారికి అలర్ట్.. పెరిగిన సిమెంట్ ధరలు.. ఎంత పెరిగాయంటే..

IPL 2022: విరాట్‌ కోహ్లీ పెద్ద విషయం వెల్లడించాడు.. వేలంలోకి రాకపోవడానికి అదే కారణమట..?