AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cement prices: ఇళ్లు కట్టుకునే వారికి అలర్ట్.. పెరిగిన సిమెంట్ ధరలు.. ఎంత పెరిగాయంటే..

బొగ్గు ధరల పెరుగుదల, అస్థిర ముడి చమురు అదనపు వ్యయ ఒత్తిడి కారణంగా సిమెంట్ ధరలు పెరిగాయి. జనవరిలో 3 -5 శాతం ధరలు పెరిగాయి...

Cement prices: ఇళ్లు కట్టుకునే వారికి అలర్ట్.. పెరిగిన సిమెంట్ ధరలు.. ఎంత పెరిగాయంటే..
Cement
Srinivas Chekkilla
|

Updated on: Feb 08, 2022 | 11:18 AM

Share

బొగ్గు ధరల పెరుగుదల, అస్థిర ముడి చమురు అదనపు వ్యయ ఒత్తిడి కారణంగా సిమెంట్ ధరలు పెరిగాయి. జనవరిలో 3 -5 శాతం ధరలు పెరిగాయి. ప్రధానంగా తూర్పు, దక్షిణ ప్రాంతాలలో ధరలు పెంచారు. నవంబర్‌లో బలహీనమైన డిమాండ్ కనిపించిన తర్వాత కదలిక వచ్చింది. సిమెంట్ కంపెనీలకు వాష్-అవుట్ – డిసెంబర్‌లో కొంత భాగం కొనసాగింది. దక్షిణ భారతదేశంలో వర్షాలు, తూర్పు భారత్‌లో ఇసుక మైనింగ్ సమస్యలు కూడా అక్టోబర్-డిసెంబర్ కాలంలో డిమాండ్‌ తగ్గుదలకు కారణమయ్యాయి. డిసెంబరు మధ్య సిమెంట్ డిమాండ్‌లో గణనీయమైన మెరుగుదల ఉందని కంపెనీలు చెబుతున్నాయి. ధరల పెరుగుదల ఫిబ్రవరిలో ఉండొచ్చని చెబుతున్నారు. సౌత్, ఈస్ట్‌ భారత్‌లో 5 శాతం, 6 శాతం పెంపుదల ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ, ఉత్తర ప్రాంతాలలో ధరలు వరుసగా 3 శాతం, 1 శాతంగా పెరిగాయి.

దేశంలో నాల్గో-అతిపెద్ద కంపెనీ దాల్మియా సిమెంట్ లిమిటెడ్, MD, CEO మహేంద్ర సింఘి బిజినెస్‌లైన్‌తో మాట్లాడుతూ, “Q3 FY22లో సామర్థ్య వినియోగం 69 శాతం నుంచి డిసెంబర్‌లో 83 శాతం పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 70-75 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ధరల పెంపుదల ఇప్పటికే అమల్లోకి వస్తుందని చెప్పారు.” రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ శ్రీ సిమెంట్స్ మేనేజ్‌మెంట్ జనవరి-ఫిబ్రవరి 2022లో వివిధ ప్రాంతాలలో ధరల పెరుగుదల ఉంటుందని పేర్కొంది.

రామ్‌కో సిమెంట్స్ మేనేజ్‌మెంట్ నివేదిక ప్రకారం, జనవరి 2022 మధ్య నుంచి పశ్చిమ బెంగాల్‌లో బ్యాగ్‌కి రూ. 30 – 40, ఒడిశాలో బ్యాగ్‌కు రూ. 15-20 పెరిగాయి. తూర్పులో ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తోంది. అలాగే, దక్షిణాదిలో రూ.15-20 వరకు బ్యాగ్ ధరలు పెరిగాయి. కేరళలో రూ.30-40 పెరిగాయి. ఇదిలా ఉండగా, జనవరి 2022లో సిమెంట్ కంపెనీలకు వ్యయం పెరిగింది. బొగ్గు ధర జనవరిలో 9 శాతం పెరిగింది.

Read Also.. NCD vs Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ కంటే ఎన్‌సీడీల్లో వడ్డీ ఎక్కువ వస్తుందా.. ఎన్‌సీడీల్లో పెట్టుబడి సురక్షితమేనా..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..