IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనలేకపోతున్న అండర్ 19 ఆటగాళ్లు.. ఆ ఎనిమిది మంది ఎవరంటే..

అండర్19 ప్రపంచ కప్(under 19 world cup) గెలిచిన భారత జట్టులోని 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలం(IPL 2022) మెగా వేలంలో పాల్గొనలేకపోతున్నారు...

IPL 2022 Auction: ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనలేకపోతున్న అండర్ 19 ఆటగాళ్లు.. ఆ ఎనిమిది మంది ఎవరంటే..
Under 19
Follow us

|

Updated on: Feb 08, 2022 | 11:25 AM

అండర్19 ప్రపంచ కప్(under 19 world cup) గెలిచిన భారత జట్టులోని 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలం(IPL 2022) మెగా వేలంలో పాల్గొనలేకపోతున్నారు. ఐపీఎల్ ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (BCCI) నిబంధనలే ఇందుకు కారణం. కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్ A మ్యాచ్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లకు మాత్రమే IPL వేలంలో ప్రాధాన్యత ఉంటుంది. ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోతే, అతను ఐపీఎల్ వేలంలో కూడా భాగం కాలేడు. అంతేకాకుండా వేలంలో పాల్గొనడానికి ఆటగాడి వయస్సు కూడా 19 సంవత్సరాలు ఉండాలి. ఇది కూడా ఒక అవరోధంగా మారింది.

బీసీసీఐ IPL వేలం కోసం ప్రమాణాలకు అనుగుణంగా లేని అండర్19 ప్రపంచ విజేత భారత జట్టులోని ఆటగాళ్లలో వికెట్ కీపర్ దినేష్ బానా, జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, మానవ్ ప్రకాష్, గర్వ్ సంగ్వాన్ ఉన్నారు. వీరిలో బానా, రషీద్, రవి, సింధు భారత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించారు.

అయితే ఈ ఆటగాళ్లు ఆడతారా లేదా అనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ అంతగా ఆడలేదని బోర్డులోని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి రంజీ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడాకారుల రాష్ట్ర జట్టు అవకాశం కల్పించినా.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే వేలానికి అర్హులు కారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 228 క్యాప్డ్, 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.

Read Also..Lata Mangeshkar: లతాజీని కలవనందుకు చింతిస్తున్నా.. లెజెండరీ సింగర్‌తో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌..