TS RTC: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టీవీ9తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పెషల్ ఇంటర్వ్యూ..

మేడారం జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడుతూ జాతరకు వెళ్లి వచ్చే వారి కోసం..

TS RTC: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టీవీ9తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పెషల్ ఇంటర్వ్యూ..
Sajjanar
Follow us

|

Updated on: Feb 08, 2022 | 3:35 PM

మేడారం జాతర(Medaram Jatara) కోసం తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌(TSRTC MD Sajjanar) తెలిపారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడుతూ జాతరకు వెళ్లి వచ్చే వారి కోసం 51 కేంద్రాల నుంచి 3845 బస్సులు నడపనున్నామని వెల్లడించారు. సమ్మక్క గద్దెల దగ్గరకు తొందరగా వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సు ఎక్కండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గత ఏడాది 19లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామన్నారు. ఈ సంవత్సరం 23లక్షల మంది ప్రయాణికులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. గత ఏడాది 3వేలకు పైగా బస్సులలో 50వేలకు పైగా ట్రిప్ రన్ చేసినట్లుగా వెల్లడించారు. మేడారం జాతరను తాము రెవెన్యూగా చూడలేదన్నారు.

గత ఏడాది 30 కోట్లు రెవెన్యూ వచ్చిందన్నారు. ప్రయాణికులు, సిబ్బంది కోసం మేడారం వద్ద సుమారు 50 ఎకరాల్లో బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది రూ.30.32 కోట్లు ఆదాయాన్ని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సారి 3,845 బస్సులు నడపాలని- 51 పాయింట్స్ నుంచి మేడారం కు ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. 11 మొబైల్ మెకానికల్ టీమ్స్ మేడారం రూట్ లో అందుబాటులో ఉంటారని తెలిపారు.

అక్కడ మౌలిక సదుపాయాలతోపాటు వైద్య బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. మేడార జాతర కోసం సుమారు 12,500 మంది ఆర్టీసీ ఉద్యోగులు సేవలు అందిస్తారన్నారు. భక్తులు పార్కింగ్‌ నుంచి వేడుకల వద్దకు చేరుకునేందుకు 30 షెటిల్‌ సర్వీసులు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, చతిస ఘడ్ నుంచి కూడా బస్సులు నడుపుతున్నామన్నారు. 30మంది ప్రయాణికులు ఉంటే ఈ నెంబర్ 040 30102829కి కాల్ చేస్తే ప్రత్యేక బస్సును వారు ఉన్న చోటికే పంపిస్తామన్నారు. ప్రజలందరూ మా వెబ్ సైట్ ను చుస్తే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు.

50 ఎకరాల్లో బేస్ కాంప్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. బస్సులు మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా 25 ఛేజింగ్ స్కాడ్ టీమ్స్ ఏర్పాటు చేసామన్నారు. ఆర్టీసీ చరిత్రలోనే మొదటిసారి రూపొందించామన్నారు. మేడారం జాతర ప్రత్యేక బస్సుల కోసం రూపొందించిన ‘మేడారం విత్‌ టీఎ్‌సఆర్టీసీ’ యాప్‌ను తీసుకొచ్చమన్నారు.

ఇవి కూడా చదవండి: Covid End: తెలంగాణ‌ క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసింది.. ఎలాంటి ఆంక్షలు లేవు.. కీలక ప్రకటన చేసిన డీహెచ్ శ్రీనివాస్

Jagananna Chedodu: ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్