Tirumala: గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది.. టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న రమణదీక్షితులు
తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే కాదు.. నాటి రాజుల నుంచి నేటి పాలకులు వరకూ దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. వేంకటాచలపతికి ఎంత పేరుందో.. అంతే పేరు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి ఉంది. అయితే ఇప్పుడు స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం నెలకొంది. లడ్డు తయారీ నాణ్యత రాజకీయ రంగుని పులుముకుంది. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులుగా గతంలో పనిచేసిన రమణదీక్షితులు స్పందించారు.
తిరుమల తిరుపతి క్షేత్రంసాక్షాత్తు ఇల వైకుంఠం అని నమ్మకం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం. ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని.. ఏడు కొండలు ఎక్కి మరీ చేరుకునే పుణ్యధామం. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే కాదు.. నాటి రాజుల నుంచి నేటి పాలకులు వరకూ దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. వేంకటాచలపతికి ఎంత పేరుందో.. అంతే పేరు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి ఉంది. అయితే ఇప్పుడు స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం నెలకొంది. లడ్డు తయారీ నాణ్యత రాజకీయ రంగుని పులుముకుంది. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులుగా గతంలో పనిచేసిన రమణదీక్షితులు స్పందించారు. ప్రసాదంపై వార్తలు బాధాకరం అంటూ కల్తీ నెయ్యి విషయంపై కన్నీరు పెట్టారు.
శ్రీవారి దేవాలయంలో ఇలా జరగడం అశేషమైన భక్తులతో పాటు అర్చకుడిగా, భక్తుడిగా తనకు ఎంతో మనోవేదన కల్గించిందని అన్నారు. ప్రధాన అర్చకుడిగా, ఆగమ సలహాదారుగా.. స్వామివారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడడం తన బాధ్యతని చెప్పారు. ప్రసాదం ముందులాగ లేదని ఎన్నో ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ప్రసాదం విషయంలో భక్తుల ఆరోపణలపై తాను ఎన్నోసార్లు టీటీడీకి ఫిర్యాదు చేశానని ఎవరూ పట్టించుకోలేదని.. తనతో కలిసి ఈ విషయంపై పోరాడడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ ఐదేళ్లు నిరాటంకంగా మహాపాపం జరిగిందని.. లడ్డుప్రసాదం పై పలుమార్లు ల్యాబ్ రిపోర్టులు చూశానని .. లడ్డులో జంతు కొవ్వు ఉన్నట్లు తెలిసి తనను ఎంతో వేదనకు గురి చేసిందన్నారు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..