AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laxmi Puja: శుక్ర దోష నివారణకు, లక్ష్మీదేవి అనుగ్రహానికి శుక్రవారం ఈ చర్యలు చేసి చూడండి..

శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని హృదయపూర్వకంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను ఇస్తుంది. డబ్బుకి ఇబ్బంది పడే వారు దీర్ఘకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు ఈ మూడు సింపుల్ టిప్స్ పాటించి చూడండి. వీటిని పాటించడం వలన ఆర్థిక లాభం కలుగుతుంది.

Laxmi Puja: శుక్ర దోష నివారణకు, లక్ష్మీదేవి అనుగ్రహానికి శుక్రవారం ఈ చర్యలు చేసి చూడండి..
Lakshmidevi Puja TipsImage Credit source: pexels
Surya Kala
|

Updated on: Sep 20, 2024 | 10:29 AM

Share

హిందూ మతంలో భగవంతుడిని ఆరాధించడానికి ప్రతి రోజు ప్రత్యేకమైనదే. అయితే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల భక్తులకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని హృదయపూర్వకంగా పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను ఇస్తుంది. డబ్బుకి ఇబ్బంది పడే వారు దీర్ఘకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు ఈ మూడు సింపుల్ టిప్స్ పాటించి చూడండి. వీటిని పాటించడం వలన ఆర్థిక లాభం కలుగుతుంది.

శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి..

ఎప్పుడూ తమని తాము శుభ్రంగా ఉంచుకోవడమే కాదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది వాతావరణంలో సానుకూలతను సృష్టిస్తుంది. శుక్రవారం తప్పని సరిగ్గా ఇంట్లో శుభ్రత ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి. లక్ష్మీదేవి మురికిగా ఉన్న ప్రదేశంలో లేదా అపరిశుభ్రమైన ప్రదేశంలో నివసించదు. అటువంటి పరిస్థితిలో శుక్రవారం రోజున ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. శుక్రవారం ఉదయం, సాయంత్రం స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించండి.

ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం

శుక్రవారం రోజు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు ఈ రోజున లక్ష్మీదేవికి పండ్లు, స్వీట్లను కూడా సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

తెల్లని వస్తువులను దానం చేయండి

శుక్రవారం రంగు తెలుపు. ఈ రోజున తెలుపు రంగు బట్టలు లేదా తెలుపు రంగు వంటకాలు దానం చేయవచ్చు. అంతే కాదు ఈ రోజు ఆవుకు పంచదార, పటిక బెల్లం కలిపిన పిండిని ఆహారంగా అందించండి. ఈ చిన్న చిన్న చర్యలు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

శుక్రుడు అనుగ్రహం కోసం ఏం చేయవచ్చు అంటే..

శుక్రవారం సాయంత్రం స్నానం చేసి లక్ష్మీ దేవిని పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మీ శక్తి మేరకు పేదలకు దానం చేయండి. అంతే కాకుండా ఈ రోజు పెరుగు తినడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఇంటి నుండి బయలుదేరే ముందు పెరుగు తినవచ్చు. ఈ రోజున ఉప్పును దానం చేయడం కూడా శ్రేయస్కరం. శుక్రవారం నాడు ‘ఓం శుం శుక్రాయ నమః’ అని జపించడం శుభప్రదమని కూడా చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి