Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతోన్న ఆపరేషన్ .. నేడు మూడో బోటు తొలగింపు ప్రయత్నం..

ప్రకాశం బ్యారేజ్‌లో ఆపరేషన్ బోటు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు బోట్లను బయటకు తీసిన ఇంజనీర్లు, అధికారులు.. మిగతా రెండు బోట్ల కోసం ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ గేట్లవద్దే చిక్కుకున్నాయి.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతోన్న ఆపరేషన్ .. నేడు మూడో బోటు తొలగింపు ప్రయత్నం..
Boat Removal Operation
Follow us
Surya Kala

|

Updated on: Sep 20, 2024 | 8:49 AM

ప్రకాశం బ్యారేజీ దగ్గర చిక్కుకున్న బోట్ల ప్రక్రియ కొనసాగుతోంది. బ్యారేజ్‌ అడుగుబాగాన చిక్కుకున్న రెండో బోటును బెకెం ఇంజినీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. గత పదిరోజులుగా బోట్ల తొలగింపులో అనేక అవస్థలు పడ్డ అధికారులు, ఇంజినీర్లు. మరో ప్రయత్నంగా ఇనుపగడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవలను వెలికితీశారు. నీటమునిగిన పడవను చైన్‌ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువ ఉన్న పున్నమి ఘాట్‌ వద్దకు తరలించారు.

బ్యారేజీ దగ్గర ఇంకా మరో భారీ బోటు, మోస్తరు బోటు ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని విశాఖకు చెందిన బృందం లోపల డ్రిల్లింగ్ తో రంథ్రాలు వేసి బయటకు తీయాల్సి ఉంటుందని సమయం పడుతుందని ఇంజినీర్ల బృందం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరో రెండు మూడు రోజుల్లో మిగతా వాటిని కూడా వెలికితీస్తామని చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ 69వ గేటు దగ్గర బోల్తా పడిన మూడో బోటును ఇవాళ సవ్య దిశలోకి తెస్తామని అధికారి కె.వి.కృష్ణారావు తెలిపారు. గడ్డర్లతో అనుసంధానించిన 2 పడవలతో బయటకు తెస్తామని ఒడ్డుకు తెచ్చిన పడవలను పున్నమి ఘాట్ వద్ద భారీ తాళ్లతో కట్టేస్తామన్నారు. ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి.

ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ గేట్లవద్దే చిక్కుకున్నాయి. ఈ బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్​ అమలు చేసిన అధికారులు, తాజాగా సఫలీకృతం అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..