AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్‌.. జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందానన్న పవన్‌.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో...

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్‌.. జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ
Pawan Kalyan
Narender Vaitla
|

Updated on: Sep 20, 2024 | 10:38 AM

Share

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుమల లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. కోట్లాది మంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు అపవిత్రమైందన్న అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడీ అంశం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఈ వివాదంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందానన్న పవన్‌.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇక ఆలయాల రక్షణపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, సనాతన ధర్మానికి ముప్పు ఎలా వచ్చినా అంతా పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత వ్యవహారంపై వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని పవన్‌ డిమాండ్ చేశారు బాధ్యులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్..

ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వివాదంపై లడాయి కొనసాగుతోంది. శ్రీవారి చెంత ప్రమాణానికి రావాలని సీఎంకు వైవీ సవాల్‌ విసిరారు. అయితే లడ్డూ వివాదంపై ఇంతవరకు టీటీడీ ఉన్నతాధికారులు మాత్రం స్పందించలేదు. తాజాగా టీడీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఈరోజు మీడియా ముందుకు రానున్నారు. దీంతో ఆయన ఏం చెప్తారన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. రమణదీక్షితులు.. ఏం చెబుతారోనని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

అసలేంటీ ఆరోపణ.?

తిరుమల లడ్డూ వివాదంలో ల్యాబ్‌ రిపోర్టే కీలకం కాబోతోంది. NDDB రిపోర్ట్‌ పేరుతో ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ రిపోర్ట్‌ ప్రకారం తిరుమలకు సప్లై చేసిన నెయ్యిలో కేవలం 19శాతం మాత్రమే నెయ్యి ఉందనేది ప్రధాన ఆరోపణ. మిగతాదంతా చేపనూనె, బీఫ్‌ టాలో, వివిధ రకాల ఆయిల్స్‌, పందికొవ్వు లాంటి పదార్ధాలే అంటోంది తెలుగుదేశం. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారనడానికి ఆధారాలు ఉన్నాయంటోంది. విజిలెన్స్‌ నివేదికతో నిజాలు బయటికి వస్తాయంటోంది. అయితే, విజిలెన్స్‌ రిపోర్ట్‌ ఒక బూటకమంటోంది వైసీపీ. అసలు నిజాలు బయటికి రావాలంటే సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌ చేస్తోంది విపక్షం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..