New Liquor Policy: కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!

New Liquor Policy: కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!

Anil kumar poka

|

Updated on: Sep 20, 2024 | 2:02 PM

లిక్కర్ క్వార్టర్ ధర 99 రూపాయిలు. అది కూడా నాణ్యమైన మద్యాన్నే ఈ రేటుకు అమ్ముతారు. ఈ మాట విన్న వెంటనే మందుబాబులకు ఎక్కడలేని హుషారు వస్తుంది. అందుకే మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఎప్పుడెప్పుడు కొత్త మద్యం పాలసీ వస్తుందా.. మందు రేటు తగ్గుతుందా.. క్వాలిటీ లిక్కర్ దొరుకుతుందా అని చాలా ఆశతో ఎదురుచూశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల లోపే కొత్త ఎక్సైజ్ పాలసీని తయారుచేసింది.

లిక్కర్ క్వార్టర్ ధర 99 రూపాయిలు. అది కూడా నాణ్యమైన మద్యాన్నే ఈ రేటుకు అమ్ముతారు. ఈ మాట విన్న వెంటనే మందుబాబులకు ఎక్కడలేని హుషారు వస్తుంది. అందుకే మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఎప్పుడెప్పుడు కొత్త మద్యం పాలసీ వస్తుందా.. మందు రేటు తగ్గుతుందా.. క్వాలిటీ లిక్కర్ దొరుకుతుందా అని చాలా ఆశతో ఎదురుచూశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల లోపే కొత్త ఎక్సైజ్ పాలసీని తయారుచేసింది. దానికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. గత ప్రభుత్వం మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో పూర్తి అవుతుంది. దీంతో వచ్చే అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఇంతకీ ఈ మద్యం పాలసీని తయారుచేయడానికి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేసింది? దేశవ్యాప్తంగా ఆ కమిటీలు ఎక్కడెక్కడికి పర్యటించాయి? వివిధ రాష్ట్రాల మద్యం పాలసీలపై ఎలాంటి అధ్యయనాన్ని చేశాయి? ఇప్పుడు కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి ఏమేరకు ఆదాయం రానుంది? మందుబాబులకు ఎలాంటి కిక్కు కలగనుంది?

ఏపీ క్యాబినెట్ ఆమోదించిన నూతన ఎక్సైజ్ పాలసీని చూస్తే.. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. ఎందుకంటే క్వార్టర్ 99 రూపాయిలకే అంటే.. అది మందుబాబులకు ప్రయోజనం కలిగించేదే. పైగా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రీమియం మద్యం షాపులను తెరవడానికి కూడా కొత్త మద్యం పాలసీ అవకాశం కలిపిస్తోంది. అయితే ఈ 12 ప్రాంతాల్లో తిరుపతి లేదు. అక్కడ ప్రీమియం షాప్ ను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు ఉంటే.. అందులో 10 శాతం షాపులు.. అంటే.. దాదాపు 340 షాపులను గీత కార్మికులకు కేటాయిస్తారు. దీంతో ఎన్నికల సమయంలో వారికి కూటమి ఇచ్చిన హామీని నెరవేర్చినట్టయ్యింది. ఈ ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఈ నూతన మద్యం విధానం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. దీని ప్రకారం లిక్కర్ షాపులు ఉదయం 10 గంటలకు తెరవవచ్చు. రాత్రి 10 గంటల వరకు వ్యాపారం చేయవచ్చు. ఇక మద్యం దుకాణాల సంఖ్యను.. జనాభా ఆధారంగా నిర్ణయించామని ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.