Watch: తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

Watch: తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Sep 20, 2024 | 2:05 PM

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయ పవిత్రతను మాజీ సీఎం జగన్ తగ్గించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసమే శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ రిపోర్టులో వెల్లడైందన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయ పవిత్రతను మాజీ సీఎం జగన్ తగ్గించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసమే శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ రిపోర్టులో వెల్లడైందన్నారు. ఈ అవినీతి సొమ్ము జగన్ ఖాతాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను జైలుకు పంపాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రకు భంగం కలిగించేలా చేయడం క్షమించరాని నేరమన్నారు. గత పాలకులు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకున్నారని ఆరోపించారు. టీటీడీ నిధులను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Published on: Sep 20, 2024 02:04 PM