YS Jagan: లడ్డూ వివాదం అంతా బాబు డైవర్షన్ : వైఎస్ జగన్
చంద్రబాబు 100 రోజుల పాలనపై ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో.. అది డైవర్ట్ చేయడానికే లడ్డూ వ్యవహారం తెరపైకి తెచ్చారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతటి దారుణమైన అబద్ధం ఆడటం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిందా..! జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని నిజంగానే లడ్డూ తయారీకి వాడారా..? కోట్లాది మంది భక్తుల్ని ఇప్పుడు ఈ వార్తలే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి..! కొవ్వు కలిసిందనే ఆరోపణలు ఇటు TDP నుంచి నుంచి వస్తుంటే.. ఇది తమను టార్గెట్ చేసే కుట్ర అని YCP భగ్గుమంటోంది. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు కోర్టును ఆశ్రయించింది YCP. మరోవైపు ఈ వివాదంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. రాజకీయాల కోసం చంద్రబాబు దేవుణ్ణి కూడా వదలటం లేదన్నాను. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారని ఆయన చెప్పారు. నెయ్యి సప్లయ్ కార్యక్రమం కొత్తది కాదని.. ప్రతి 6 నెలలకు ఒక సారి టెండర్లు పిలుస్తారని.. టెండర్ ఎవరికి వస్తే వాళ్లకు బోర్డు అప్రూవ్ చేస్తుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..