Kawasaki Disease: గుజరాత్‌లో కవాసకి వ్యాధి.. ఆరేళ్ల చిన్నారిలో గుర్తింపు.. ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలుసా?
జునాగఢ్‌లోని గిర్ సోమనాథ్‌లోని తలాలా గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు కనుగొనబడ్డాయి. ఈ వ్యాధికి సంబంధించిన మొదటి కేసు ఇదేనని చెబుతున్నారు. ప్రస్తుతం జునాగఢ్‌లోని సివిల్ హాస్పిటల్‌లో బాలిక చికిత్స తీసుకుంటుంది. బాలికకు ప్రథమ చికిత్స అందించారు. అయితే బాలికలో ఈ వ్యాధి లక్షణాలు తీవ్రం అవ్వడంతో సివిల్ ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు.
దేశంలో రకరకాల వైరస్ లు విజృంభిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఇప్పటికే కేరళలో నిఫా, మంకీఫక్స్ వైరస్ లు వెలుగులోకి రాగా.. గుజరాత్‌లోని జునాగఢ్‌లో కవాసకి వ్యాధి మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపించినప్పటికీ.. ఈ సంవత్సరం జునాగఢ్‌లోని గిర్ సోమనాథ్‌లోని తలాలా గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు కనుగొనబడ్డాయి. ఈ వ్యాధికి సంబంధించిన మొదటి కేసు ఇదేనని చెబుతున్నారు. ప్రస్తుతం జునాగఢ్‌లోని సివిల్ హాస్పిటల్‌లో బాలిక చికిత్స తీసుకుంటుంది. బాలికకు ప్రథమ చికిత్స అందించారు.
అయితే బాలికలో ఈ వ్యాధి లక్షణాలు తీవ్రం అవ్వడంతో సివిల్ ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని, ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఈ వ్యాధి కి సంబంధించిన మొదటి కేసు ఇదేనని ప్రస్తుతం ఈ కవాసకి వ్యాధికి సంబంధించిన కేసులేవీ నమోదు కాలేదని స్థానిక వైద్యులు చెబుతున్నారు.
కవాసకి వ్యాధి అంటే ఏమిటి?
కవాసకి వ్యాధి అనేది శరీరంలోని రక్తనాళాలకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో రక్తనాళాల గోడలు వాచిపోతాయి. ఈ వాపు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను బలహీనపరుస్తుంది. పరిస్థితి తీవ్రంగా మారితే రోగి గుండె ఆగిపోవచ్చు. గుండెపోటుతో కూడా బాధపడవచ్చు. సాధారణంగా జ్వరంతో పాటు, చర్మంపై దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తాయి. అంతేకాదు చేతులు, గొంతు, కళ్ళు ఎర్రగా మారడం ప్రారంభిస్తాయి.
కవాసకి అనేది ఒక రకమైన సిండ్రోమ్. ఈ వ్యాధి రావడానికి గల కారణం ఇంకా తెలియలేదు. చాలా సందర్భాలలో ఈ వ్యాధి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధిలో రోగి శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. వాపు సంభవిస్తుంది. జ్వరం కూడా ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది.
కవాస వ్యాధి లక్షణాలు
- రక్తనాళాలలో వాపు
- నోరు, నాలుక ఎరుపు
- జ్వర తీవ్రత ఉంటుంది.
- ఈ వ్యాధి అంటువ్యాధి కాదు
కవాసకి వ్యాధి అంటువ్యాధి కాదు. అంటే ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించదు. తరచుగా ఈ వ్యాధి దానంతటదే నయమవుతుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైతే అది గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి సంబంధించిన కేసులు శీతాకాలంలో ఎక్కువగా నమోదవుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి