వృద్ధ మహిళను చుట్టేసిన 13 అడుగుల కొండచిలువ.. ప్రాణాల కోసం 2 గంటల పాటు పోరాడుతూనే ఉంది.. వీడియో వైరల్

ఒక వృద్ధ మహిళ ఇంటి బయట వంట పాత్రలు శుభ్రపరుస్తుండగా హటాత్తుగా ఆమెని ఒక పెద్ద కొండచిలువ చుట్టేసింది. అంతేకాదు ఆ మహిళను పలుమార్లు కొరికి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కొండచిలువ దాడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆ మహిళ కొండచిలువ తలను పట్టుకుంది. అయితే ఆ కొండ చిలువ మహిళలను విడిచిపెట్టడానికి బదులు మరింత గట్టిగా చుట్టేసింది. అదృష్టవశాత్తు మహిళ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

వృద్ధ మహిళను చుట్టేసిన 13 అడుగుల కొండచిలువ.. ప్రాణాల కోసం 2 గంటల పాటు పోరాడుతూనే ఉంది.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Sep 20, 2024 | 10:08 AM

థాయ్‌లాండ్‌లో పాములను తినడమే కాదు.. పాములతో మసాజ్ కూడా చేయించుకుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా థాయ్‌లాండ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఒక వృద్ధ మహిళ ఇంటి బయట వంట పాత్రలు శుభ్రపరుస్తుండగా హటాత్తుగా ఆమెని ఒక పెద్ద కొండచిలువ చుట్టేసింది. అంతేకాదు ఆ మహిళను పలుమార్లు కొరికి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కొండచిలువ దాడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఆ మహిళ కొండచిలువ తలను పట్టుకుంది. అయితే ఆ కొండ చిలువ మహిళలను విడిచిపెట్టడానికి బదులు మరింత గట్టిగా చుట్టేసింది. అదృష్టవశాత్తు మహిళ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

బ్యాంకాక్‌కు దక్షిణాన ఉన్న సముత్ ప్రకాన్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. 64 ఏళ్ల ఆరోమ్ అరుణ్‌రోజ్‌పై 13 అడుగుల పొడవున్న కొండచిలువ దాడి చేసింది. ఆరోమ్ కూర్చున్న చోటు నుంచి కదలలేని విధంగా పాము మహిళను చుట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆ వృద్ధురాలిని రక్షించారు.

ఇవి కూడా చదవండి

కొండచిలువలు విషపూరితమైనవి కావు..అయినప్పటికీ అవి దాడి చేస్తే ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా ఈ పాము మనిషిని చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తుంది. జీవి మరణించిన తర్వాత దానిని మింగుతుంది. అయితే ఈ కొండచిలువ వృద్ధురాలిని చుట్టడమే కాదు.. పలుచోట్ల కాటువేసింది. దీంతో ఆ వృద్ధురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

మీడియా కథనాల ప్రకారం పోలీసులు తనను రక్షించేందుకు తన వద్దకు వచ్చే వరకు ఆ కొండ చిలువలను వృద్ధ మహిళను సుమారు రెండు గంటలపాటు బందీగా ఉంచింది. అదే సముయంలో కొండచిలువ మహిళను చుట్టుకోవడంతో ఆమె కదలలేని స్థితిలో ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. అంతేకాదు కొండచిలువ కాటు వేసిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి.

కొండచిలువ దాడి చేస్తున్న వీడియో

కొండచిలువల వంటి భారీ పాములు మనుషులపై దాడి చేసిన సంఘటనలు తరచుగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యంగా తాము ప్రమాదంలో ఉన్నట్లు అనిపించినా లేదా ఆహారం గురించి వేటాడుతున్న సమయంలో కొండచిలువలు ఇలా దాడి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..