Pakistan: జమ్మూకశ్మీర్లో భారీ ఓటింగ్.. ఎన్నికలు చెల్లవంటూ మరోసారి భారత్ పై విషం కక్కిన పాక్..

జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి దశలో భారీ ఓటింగ్‌ నమోదు చేసుకుంది. ఈ ఓటింగ్ పై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడుతూ భారత్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ (IIOJK)లో జరిగిన ఈ ఎన్నికలకు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి విలువ లేదని అన్నారు. అంతర్జాతీయ చట్టాల దృష్టిలో ఈ ఎన్నికలకు చట్టపరమైన విలువ లేదని భారత్‌కు గుర్తు చేయాలనుకుంటున్నామని బలూచ్ అన్నారు.

Pakistan: జమ్మూకశ్మీర్లో భారీ ఓటింగ్.. ఎన్నికలు చెల్లవంటూ మరోసారి భారత్ పై విషం కక్కిన పాక్..
Mumtaz Zahra Baloch's
Follow us

|

Updated on: Sep 20, 2024 | 12:02 PM

భారత్‌పై పాకిస్థాన్ విషం చిమ్ముతూనే ఉంది. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికలపై స్పందిస్తూ తన అక్కసుని మరోసారి వెళ్ళగక్కింది. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు హాస్యాస్పదమని పాకిస్థాన్ అభివర్ణించింది. తొలి దశ ఎన్నికల్లో బంపర్ ఓటింగ్ జరిగిన తర్వాత పాకిస్థాన్ ఈ ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని 24 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న తొలి దశ పోలింగ్ జరిగింది. తొలి దశలో 60 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది.

జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి దశలో భారీ ఓటింగ్‌ నమోదు చేసుకుంది. ఈ ఓటింగ్ పై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడుతూ భారత్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ (IIOJK)లో జరిగిన ఈ ఎన్నికలకు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి విలువ లేదని అన్నారు. అంతర్జాతీయ చట్టాల దృష్టిలో ఈ ఎన్నికలకు చట్టపరమైన విలువ లేదని భారత్‌కు గుర్తు చేయాలనుకుంటున్నామని బలూచ్ అన్నారు.

ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని గుర్తు చేస్తోన్న పాక్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి భారత్‌కు గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం ద్వారా జమ్మూ కాశ్మీర్ వివాదానికి తుది పరిష్కారం కాశ్మీర్ ప్రజల కోరిక మేరకు జరుగుతుందని ఐక్యరాజ్యసమితి తీర్మానంలో స్పష్టంగా వ్రాయబడిందని బలూచ్ చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలు ఆక్రమణలకు గురవుతున్నారన్నారు. కాశ్మీరీ రాజకీయ ఖైదీల సంఖ్య వేలల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

జమ్ముకాశ్మీర్ లో భయం, బెదిరింపు వాతావరణం నెలకొందని.. కనుక ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికలకు ఎటువంటి చెల్లుబాటు లేదన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం జమ్మూ కాశ్మీర్ వివాదం న్యాయమైన, శాంతియుత పరిష్కారం కోసం కాశ్మీరీ సోదరులకు, సోదరీమణులకు పాకిస్తాన్ రాజకీయ, దౌత్య , నైతిక మద్దతును అందిస్తుందని వెల్లడించారు. భద్రతా మండలి తీర్మానాలకు మద్దతు కొనసాగుతుందన్నారు.

కాశ్మీర్ అంతర్జాతీయంగా వివాదాస్పద అంశం -పాక్

గతంలో కూడా జమ్మూ కశ్మీర్ వివాదంపై బలూచ్ ఇదే విధమైన ప్రకటన చేశారు. జమ్మూ కశ్మీర్ వివాదాన్ని ఏకపక్షంగా పరిష్కరించలేమని ఆయన ఇటీవలే ప్రకటించారు. ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. భద్రతా మండలి తీర్మానాలు, కాశ్మీర్ ప్రజల కోరికల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.

దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలకు ఈ అపరిష్కృత వివాద పరిష్కారం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. దౌత్యం, చర్చలకు పాకిస్థాన్ కట్టుబడి ఉందని.. అయితే ఎలాంటి శత్రు చర్యకైనా గట్టిగా సమాధానం చెబుతామని బలూచ్ చెప్పారు.

తొలి దశలో 61.11 శాతం ఓటింగ్‌ నమోదు

మొదటి దశలో జరిగిన ఓటింగ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కొన్నిసార్లు భయం, హింస నీడలో ఎన్నికలు జరిగిన చోట.. మొదటి సారి మొదటి దశలో శాంతియుత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. తొలి దశలో 61.11 శాతం ఓటింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం, శాంతి, ప్రగతిపై ప్రజలకు ఉన్న దృఢ విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోంది.

2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండో, మూడో దశ పోలింగ్‌ సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు రానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..