Peepal Worship Tips: ఈ రోజున రావి చెట్టుకుని పూజచేస్తే ఆ జన్మ దరిద్రం మీ.. సొంతం.. పూజా నియమాలు ఏమిటో తెలుసా
రావి చెట్టుమీద శ్రీ మహా విష్ణు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి. అందుకే హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు. అయితే రావి చెట్టుని పూజించదానికి ఒక పద్దతి పూజా విధానం ఉంది. పొరపాటున కూడా రావి చెట్టుని కొన్ని విధాలుగా పూజించకూడదు. ఈ నేపథ్యంలో ఈ రోజు రావి చెట్టుకి మతపరమైన ప్రాముఖ్యత, పూజా నియమాలు, చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం..

హిందూ మతంలో సమస్త ప్రాణికోటిలో దేవుళ్లున్నారని నమ్మకం. చెట్లు, జంతువులు, పక్షులను కూడా దైవంగా భావించి పూజిస్తారు. దేవతలకు సంబంధించిన పక్షుపక్ష్యాదులను, చెట్లను పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు. హిందూ సనాతన ధర్మంలో పూజ్యనీయ మైన చెట్లలో ఒకటి రావి చెట్టు ఒకటి. ఈ చెట్టుమీద శ్రీ మహా విష్ణు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి. అందుకే హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు. అయితే రావి చెట్టుని పూజించదానికి ఒక పద్దతి పూజా విధానం ఉంది. పొరపాటున కూడా రావి చెట్టుని కొన్ని విధాలుగా పూజించకూడదు. ఈ నేపథ్యంలో ఈ రోజు రావి చెట్టుకి మతపరమైన ప్రాముఖ్యత, పూజా నియమాలు, చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం..
రావి చెట్టుని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు
హిందూ విశ్వాసం ప్రకారం రావి చెట్టుని పూజిస్తే ఆ భక్తుని పట్ల శ్రీమహా విష్ణువు అనుగ్రహం సదా ఉంటుంది. అదే ఆసమయంలో లక్ష్మీదేవి ఆశీస్సులు, కర్మ ప్రదాత శనీశ్వరుడు ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా పూర్వీకులు కూడా రావి చెట్టుపై నివసిస్తారని హిందువుల విశ్వాసం. అటువంటి పరిస్థితిలో ఎవరైనా అమావాస్య రోజున రావి చెట్టు వద్ద దీపం పెట్టినట్లు అయితే అతని పూర్వీకులు ప్రసన్నం అవుతారని విశ్వాసం. తమ వారసులకు సుఖ సంపదలను ప్రసాదిస్తారని నమ్మకం. అంతేకాదు రావి చెట్టుని పూజించేవారికి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.




రావి చెట్టుని ఎప్పుడు పూజించాలి.. ఎప్పుడు పూజించరాదంటే..
హిందూ విశ్వాసం ప్రకారం రావి చెట్టు ఆరాధనకు కొన్ని రోజులు మంగళకరమైనవి. కొన్ని అశుభమైనవి. హిందూ విశ్వాసం ప్రకారం.. వారంలోని ఆరు రోజులు అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు పూజించడానికి అనుకూలమైనవి. పుణ్యమైనవిగా భావిస్తారు. అదే సమయంలో ఆదివారం నాడు పూజించడం దోషంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం.. లక్ష్మీదేవి అక్క దారిద్ర దేవత జేష్టాదేవి ఆదివారం రావి చెట్టులో నివసిస్తుంది. కనుక ఆదివారం రోజున రావి చెట్టుని పూజించిన మనిషి జీవితం దుర్భ దారిద్య్రంలో చిక్కుకుంటారు. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు.
రావి చెట్టుని ఏ రోజున నరకాలంటే..
రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు.. కనుక ఈ చెట్టుని నరకాలంటే కూడా కొన్ని నియమాలున్నాయి. రావి చెట్టుని కట్ చేయాలంటే ఆదివారం మాత్రమే చేయాలనీ పేర్కొన్నారు. అయితే రావి చెట్టుని నరికే ముందు.. విష్ణువుని ప్రార్ధించి క్షమాపణ చెప్పాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
రావి ఆకు విశిష్టత
హిందూ విశ్వాసం ప్రకారం రావి ఆకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ.. ఎప్పటికీ ఆర్ధిక ఇబ్బందులు తొలగక పొతే.. గురువారం రోజు ఇంట్లో రావి ఆకుతో పూజ చేయాలి. రావి ఆకు తెచ్చి శుభ్రంగా కడిగి పసుపు ,చందనం లేదా కుంకుమతో ఓం శ్రీ హ్రీ శ్రీ నమః అనే మంత్రాన్ని రాయండి. అనంతరం లక్ష్మీదేవికి సమర్పించండి. దీనిని దైవ ప్రసాదంగా భావించి, డబ్బులు పెట్టుకునే ప్లేస్ లో ఉంచండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).