Kathgarh Shiva Mandir : వేసవిలో శివ పార్వతులుగా .. శీతాకాలంలో అర్ధనారీశ్వరులుగా దర్శనమిచ్చే లింగం ఎక్కడ ఉందో తెలుసా..!

హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలకు నెలవే కాదు.. అనేక పురాతన ప్రసిద్ధి ఆలయాలకు నిలయం. ఈ దేవాలయాలు అనేక అద్భుతాలు, రహస్యాలను తమలో దాచుకున్నాయి...

Kathgarh Shiva Mandir :  వేసవిలో శివ పార్వతులుగా .. శీతాకాలంలో అర్ధనారీశ్వరులుగా దర్శనమిచ్చే లింగం ఎక్కడ ఉందో తెలుసా..!
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2021 | 12:40 PM

Kathgarh Shiva Mandir : హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలకు నెలవే కాదు.. అనేక పురాతన ప్రసిద్ధి ఆలయాలకు నిలయం. ఈ దేవాలయాలు అనేక అద్భుతాలు, రహస్యాలను తమలో దాచుకున్నాయి. అటువంటి ప్రసిద్ధి చేసిన పురాతన శివాలయం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శివుడు, పార్వతి కలిసి దర్శనమిస్తారు.

ఇక్కడ శివలింగం రెండు భాగాలుగా ఉంటుంది.. పెద్ద లింగాన్ని శివుడిగా , చిన్నలింగాన్ని పార్వతిగా భక్తులు కొలుస్తారు. అంతేకాదు 8 అడుగులు ఉన్న లింగాన్ని శివుడుగా 6 అడుగులున్న లింగాన్ని పార్వతిగా భక్తులు పూజలందుకుంటున్నారు.ఇక్కడ శివలింగం అష్టభుజి..అయితే ఈ ఆలయంలో నిర్దిష్ట సమయాల్లో ఓ అద్భుతం జరుగుతుంది.మారుతున్న కాలంతో పాటు అంటే వేసవికాలంలో లింగం విభజింపబడి రెండు లింగాలుగా మారతాయి. వీటి మధ్య దూరం పెరుగుతుంది. మళ్ళీ శీతాకాలంలో ఆరెండు లింగాలు దగ్గరకు జరిగి.. ఏకలింగంగా మారతాయి. అందుకనే ఇక్కడ శివుడు అర్ధనారీశ్వరుడుగా పూజలను అందుకుంటున్నారు.

స్థలం పురాణం:

“శివ పురాణం” లోని ఒక కథనం ప్రకారం, విష్ణువు , బ్రహ్మ దేవుడు మధ్య తమలో ఎవరు గొప్ప అనే అంశంపై వాదన చోటు చేసుకుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఇద్దరూ యుద్ధాన్ని దిగారు. దీంతో ప్రకృతి భయకంపితురాలైంది. ఈ సమయంలో శివుడు రంగంలోకి దిగి.. బ్రహ్మ, విష్ణువుల మధ్య అగ్ని స్తంభంగా దర్శనమిచ్చాడు. తమ మధ్యలో ఉద్భవించిన అగ్ని స్థంభం ఏమిటో తెలుసుకోవాలని విష్ణువు అడుగున ఆరాతీయడానికి.. బ్రహ్మ పై భాగానికి వెళ్లారు..

అయితే ఇద్దరూ ఆది, అంతం కనిపెట్టలేక తిరిగి యధాస్థానికి చేరుకున్నారు. బ్రహ్మ దేవుడు మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకుని వచ్చాడు. ఇద్దరూ రాజీ పడ్డారు.. అప్పుడు లయకారుడు తన నిజస్వరూపం తో విష్ణు, బ్రాహ్మలు దర్శనమిచ్చిన ప్రాంతంఇది అని పురాణ కథనం. ఇక్కడ ఆలయం రోమన్ ఆర్కిటెక్ కల్చర్ తో నిర్మించారు. బియాస్, చోచ్ నదుల సంగమ ప్రాంతంలో అర్ధనారీశ్వరుడుగా కొలువై ఉన్నాడు.

ఎలా చేరుకుకోవాలంటే

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దులోని కాంగ్రా జిల్లాలో ఉంది . ఇండోరా నుండి 7 కిలోమీటర్లు దూరంలో ఉన్నది ఈ దేవాలయం.

Also Read:

లేపాక్షి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించిన బాలకృష్ణ దంపతులు

‘రాధేశ్యామ్’ నుంచి మరో అప్‏డేట్.. మహాశివరాత్రి కానుకగా అందమైన పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..