CM Jagan : మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ స్టేడియంలో పెద్దయెత్తున శివరాత్రి పూజలు, హాజరైన ఏపీ సీఎం జగన్
MahaShivaratri CM Jagan : మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాలకు హాజరయ్యారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో స్టేడియంలో పెద్దయెత్తున శివరాత్రి..
MahaShivaratri CM Jagan : మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్. కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాలకు హాజరయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో స్టేడియంలో పెద్దయెత్తున శివరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రప్రజలకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు చెప్పిన జగన్, పూజా క్రతువులో పాలుపంచుకుంటున్నారు. అభిషేకం, మహా హోమం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఎన్టీఆర్ స్టేడియంలో సూర్యోదయం నుంచి అర్థరాత్రి లింగోద్భవ కాలం వరకు రుద్రపారాయణం, రుద్రహోమం, సహస్రలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణ కార్యక్రమాలు జరుగుతాయి. సీఎం జగన్‌కు పరమశివుడి కృపాకటాక్షాలు సిద్ధించాలనే సంకల్పంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు నాని తెలిపారు.
కాగా, “విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.” అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారాకూడా జగన్ శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు.
విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. #MahaShivaratri
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 11, 2021
Read also : Kollu Ravindra gets Bail : బ్రేకింగ్ న్యూస్ : మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు