Kedarnath Temple: మే 17న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం.. ఓంకారేశ్వర ఆలయంలో ప్రకటించిన దేవస్థాన్ ట్రస్ట్ బోర్డు
Kedarnath Temple: ప్రముఖ ప్రఖ్యాత కేదార్‌నాథ్ ఆలయంలో మే 17వ తేదీన ఉదయం 5 గంటలకు తెరుచుకోనుంది. కేదార్‌నాథ్ రావల్, అనుభవజ్ఞులైన తీర్థ పురోహితులు, ఆచార్య, ..
Kedarnath Temple: ప్రముఖ ప్రఖ్యాత కేదార్‌నాథ్ ఆలయంలో మే 17వ తేదీన ఉదయం 5 గంటలకు తెరుచుకోనుంది. కేదార్‌నాథ్ రావల్, అనుభవజ్ఞులైన తీర్థ పురోహితులు, ఆచార్య, వేదపండితులు, ముఖ్యమైన సభ్యులు ఉఖిమఠ్‌లోని పంచకేదార్ గడీస్తల్ ఓంకారేశ్వర్ ఆలయం వద్ద గురువారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజున ఓంకారేశ్వర ఆలయంలో కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం తలుపులు తెరిచేందుకు మే 13న భైరవనాథ్‌ను ఉఖిమఠ్‌లోని పూజించనున్నారు. అయితే బాబా కేదార్ డోలీ ఉఖిమఠ్ నుంచి బయలుదేరి మే 14వ తేదీ వరకు ఫతాకు చేరుకుంటుంది. 15న కేదార్‌నాథ్ ధామ్, 16న కేదార్‌నాథ్ చేరుకుంటుంది.
అనంతరం 17న ఉదయం 5 గంటలకు భక్తుల దర్శనార్థం తలుపులు తెరుస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో హవనం, భజన సంకీర్తనలు, ఇతర సంకీర్తన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇక బద్రీనాథ్ ధామ్ ఆలయం మే 18వ తేదీన తెరవనున్నట్లు ఉత్తరాఖండ్ చార్‌ధాహ్ దేవస్థాన్ మేనేజర్ ట్రస్ట్ బోర్డు వెల్లడించింది.
నరేంద్రనగర్‌లోని టెహ్రీ రాజవంశం గత గత మంగళవారం వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మే 18న సాయంత్రం 4.15గంటలకు బ్రహ్మ ముహూర్తంలో భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉంటుందని బోర్డు తెలిపింది. కాగా, చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయంలో గత సంవత్సరం నవంబర్ 19న శీతాకాలం సందర్భంగా మూసివేశారు.
ఇవి చదవండి :
మహాశివరాత్రి మహాత్యంః లింగాకార స్వరూపుడికి రుద్రాభిషేకం.. జగమంతా పంచాక్షర మంత్రం..
mahashivaratri 2021 : శివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం చేయాలి ? దీని వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా..!